close
Choose your channels

బిగ్‌బాస్ ఓటీటీ: గాడిలో పడుతోన్న గేమ్.. ఆ కంటెస్టెంట్ ఆటకు జనం ఫిదా, టైటిల్ అతనిదేనా..?

Thursday, April 14, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఐదవ సీజన్’‌లో టైటిల్ విన్నర్‌గా వీజే సన్నీ... రన్నరప్‌గా యూట్యూబర్ షణ్ముఖ్ నిలిచారు. ప్రస్తుతం బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షో గత ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో ఘనంగా ప్రారంభమైంది. నో కామా.. నో పులుస్టాప్ .. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌గా బిగ్‌బాస్ ఓటీటీ నిరంతరాయంగా 84 రోజులు పాటు ఏకధాటిగా ప్రసారమవుతోంది. ఇప్పుడిప్పుడే షో మంచి రసపట్టుతో సాగుతోంది. కంటెస్టెంట్స్ తమ తెలివి తేటలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నారు.

షో గాడిన పడుతుండటంతో బిగ్‌బాస్ ఓటీటీ విజేత ఎవరు అవుతారోనన్న దానిపై జనం అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో అందరి కంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘‘నటరాజ్‌ మాస్టర్’’. టీవీ బిగ్‌బాస్‌లో మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఆయన ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎత్తులకు పైఎత్తులు, కోపానికి కోపం, స్నేహానికి ప్రాణం అన్నట్లుగా నటరాజ్ మాస్టర్ సాగుతున్నారు.

ఆటని అతనిలోని వేడిని చూస్తుంటే, అతని ఫిల్మీ కటౌట్‌ బిగ్‌ స్క్రీన్‌కి ‌సరిపోతుందని, పలు వెబ్‌ సిరీస్‌లలో అవకాశాలు వచ్చాయని ఓటీటీ టాక్. గతంలో అచ్చు ఇలానే  ముక్కు సూటిగా ఆడిన సన్నీ లక్షణాలు నటరాజ్‌లో కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. అంతేకాదు నటరాజ్‌ గతంలో తనకు తోచినంతలో కొద్దిమందికి దానాలు చేశాడని.. అతనికి జాలి, దయ, మానవత్వం వంటి సుగుణాలు బానే వున్నాయని వినబడుతోంది.

ఇక బిగ్‌బాస్ ఓటీటీలో కంటెస్టెంట్స్‌ పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. నటరాజ్ లేకపోతే ఆ అటలో మసాలా తగ్గుతుందేమోనని అనిపించేలా టాస్క్‌ల్లో వేడి పుట్టిస్తున్నాడు. అషూ రెడ్డి కూడా నిజాయితీగా ఆడుతున్నా ఈసారి ఆమెను కూడా గట్టిగానే టార్గెట్‌ చేశారని అర్ధమవుతోంది. అఖిల్‌ సైతం బిందుకి తనలోని కొత్త షేడ్‌ చూపించాడు. అఖిల్‌ ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఆడటం అతనికి మైనస్‌‌గా మారిందనే  కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్‌ కూడా మోహమాటంగానే ఆడతాడని... కాస్త యాక్టివ్‌గా ఉంటే బెటర్‌ అని ప్రేక్షకులు సూచిస్తున్నారు. చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతుందో.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.