అక్రమాస్తుల కేసులో రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు బెయిల్

  • IndiaGlitz, [Wednesday,April 03 2024]

అక్రమాస్తుల కేసులో అరెస్టైన రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణకు భారీ ఊరట దక్కింది. నిర్ణీత సమయం 60 రోజుల్లో ఛార్జీషీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరైంది. ఏసీబీ న్యాయస్థానం అతడితో పాటు సోదరుడు శివ నవీన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని కోర్టు షరతు విధించింది. లక్ష రూపాయలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ జనవరి 25న అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

అవినీతి ఆరోపణలతో హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ పట్టణ ప్రణాళిక విభాగం(HMDA) మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి వందల కోట్ల ఆస్తులు సంపాదించడం చూసి అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. హెచ్ఎండీఏ పరిధి జోన్లలోని నిబంధనలను ఆసరాగా చేసుకొని వందల దరఖాస్తులకు ఆమోదం తెలిపేందుకు భారీగా వసూళ్లు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ ఇళ్లు, బంధువులు ఇళ్లల్లో 14 బృందాల అధికారులు సోదాలు జరిపారు.

క్యాష్ కౌంటింగ్ యంత్రాలు పెట్టి మరీ డబ్బులు లెక్కించారు. తనిఖీల్లో భాగంగా రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. ఆయన అక్రమ ఆస్తులను చూసి అధికారులే షాక్ తిన్నారు. బంధువుల పేరిట 214 ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా.. జనగామ జిల్లాలో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 38, సిద్దిపేటలో 7 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్టు అధికారుల తనిఖీల్లో తేలింది.

దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. అప్పటి నుంచి చంచ‌ల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అరెస్ట్ కావడంతో ప్రభుత్వం ఉద్యోగం నుంచి బాలకృష్ణను సస్పెండ్ చేసింది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాజకీయ నేతల అండదండలతో పాటు ఉన్నతాధికారుల సహకారంతోనే కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది.

More News

జూనియర్ ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తా: కోన వెంకట్

టాలీవుడ్ రైటర్ కోన వెంకట్ పలు హిట్ సినిమాలకు కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆయన మాటలు అందించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

Konda Surekha: ట్యాపింగ్ ఆరోపణలపై మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్‌ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్ నేత కేకే మహేందర్‌ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.

Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. ఎన్నికల ప్రచారం నిలిపివేత..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం తెనాలిలో జరగాల్సిన ర్యాలీ

Killi Kruparani: వైసీపీకి మరో షాక్.. కేంద్ర మాజీ మంత్రి రాజీనామా..

ఎన్నికల సమయంలో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను

సీమలో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా.? టీడీపీ ప్రభావం చూపిస్తుందా..?

గతంలో కంటే ఈసారి ఏపీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గెలుపు కోసం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి.