రెండో రోజుకి చేరిన ఫ్రెండ్ రిక్వెస్ట్ టీమ్ ఆమరణ నిరాహార దీక్ష...

  • IndiaGlitz, [Saturday,July 09 2016]

హీరో & డైరెక్ట‌ర్ ఆదిత్యా ఓం ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు. సోష‌ల్ మీడియా బ్యాక్ డ్రాప్ తో రూపొందించిన ఫ్రెండ్ రిక్వెస్ట్ చిత్రాన్ని ఈనెల 8న రిలీజ్ చేయాల‌నుకున్నారు. యూత్ ఫుల్ మూవీ కావ‌డంతో...ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కాలేజీల‌కు వెళ్లి ప్ర‌మోష‌న్ చేసారు. యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది అంతా ఓకే...అనుకుని ఈనెల 8న రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే...ఈ చిత్రానికి నైజాం లో 30 థియేట‌ర్స్ ఇస్తామ‌న్న డిస్ట్రిబ్యూట‌ర్ రిలీజ్ రోజు మూడు థియేట‌ర్స్ మాత్ర‌మే ఇస్తామ‌న‌డంతో ఫ్రెండ్ రిక్వెస్ట్ టీమ్ షాక‌య్యింది.
దీంతో త‌మ‌కు న్యాయం చేయాలంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్ టీమ్ ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద నిన్న‌ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష ప్రారంభించింది. రెండో రోజైన ఈరోజు కూడా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష కొన‌సాగుతుంది. 20 మందికి పైగా చిన్న నిర్మాత‌లు ఆదిత్య ఓం చేస్తున్న ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలియ‌చేసారు. మ‌రి...ఈ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష ఎంత వ‌ర‌కు వెళుతుందో...? చూడాలి.

More News

అది తెలియ‌క‌పోయినా డ‌బ్బింగ్ చెప్పాను - జ‌గ‌ప‌తి

జురాసిక్ పార్క్ , జాస్, ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిఎల్బర్గ్ దర్శకత్వం లో వస్తోన్న అద్భుతమైన ఫాంటసి చిత్రం ది బి ఎఫ్ జి (ది బిగ్ ఫ్రెండ్లీ  జయంట్).  డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రాన్ని ఈనెల‌లో దేశ వ్యాప్తం గా రిలయన్స్ వారు  విడుదల చేయ‌నున్నారు.

త్రిష నాయ‌కి ని మెచ్చుకున్న ఇలియానా

నాయ‌కి చిత్రం లుక్ తో పాటు ట్రైల‌ర్స్ పాట‌లు బాగున్నాయి అంటూ మ‌రో ప్ర‌ముఖ క‌థానాయిక ఇలియానా మెచ్చుకున్నారు. త్రిష ప్ర‌ధాన పాత్ర‌ధారిణిగా  గోవి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం నాయ‌కి. రాజ్ కందుకూరి స‌మ‌ర్ప‌ణ‌లో గిరిధ‌ర్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ బ్యానర్ పై గిరిధ‌ర్ మామిడిప‌ల్లి, ప‌ద్మ‌జ మామిడిప‌ల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడు&

ఇండియ‌న్ హెర్కుల‌స్‌గా న‌టించాల‌నుంది - రానా

హెర్కుల‌స్ గ్రీకు దేవుడు, వీరుడు. భూమినంతా అత‌డే మోస్తున్నాడ‌ని గ్రీకుల అభిప్రాయం. హెర్కుల‌స్ పై చాలా హాలీవుడ్ సినిమాలు రూపొందాయి.

బ‌న్ని హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నరానా..

ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 చిత్రంలో న‌టిస్తున్నారు. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి 2 ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

రోబో సీక్వెల్‌పై నిర్మాత‌ల వివ‌ర‌ణ‌...

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ రోబో ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెల‌సిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 2.0 రూపొందుతోంది. ఇప్ప‌టికే 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ నెగ‌టివ్ రోల్ చేస్తున్నాడు.