close
Choose your channels

బ‌న్ని హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నరానా..

Saturday, July 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 చిత్రంలో న‌టిస్తున్నారు. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న బాహుబ‌లి 2 ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంతో పాటు రానా తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న ఘాజీ చిత్రంలో కూడా న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాల‌తో పాటు రానా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది.

ఇప్పుడు ఈ చిత్రంలో కాజ‌ల్ తో పాటు మ‌రో హీరోయిన్ కేథ‌రిన్ కూడా న‌టిస్తుంద‌ని స‌మాచారం. బ‌న్ని స‌రైనోడు సినిమాలో న‌టించిన కేథ‌రిన్ ఈ మూవీ స‌క్సెస్ త‌ర్వాత టాలీవుడ్ లో మంచి ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటుంది. కేథ‌రిన్ రానా న‌టించిన రుద్ర‌మ‌దేవి చిత్రంలో న‌టించింది. కానీ....రుద్ర‌మ‌దేవి చిత్రంలో రానా, కేథ‌రిన్ కాంబినేష‌న్ లో సీన్స్ లేవు. ఈ చిత్రంలో రానా - కేథ‌రిన్ పై రొమాంటిక్ సీన్స్ ఉన్నాయ‌ట‌. ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నారు. రానా ఒకే చిత్రంలో ఇద్ద‌రు మెగా హీరోయిన్స్ తో న‌టిస్తుండ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.