close
Choose your channels

గణేష్ బెల్లంకొండ హీరోగా 'స్వాతిముత్యం'

Tuesday, September 14, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వెండితెరకు మరో వారసుడు హీరో గా పరిచయం అవుతున్నారు. అతని పేరు "గణేష్ బెల్లంకొండ" ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు ఈ 'గణేష్'.

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ 'గణేష్' ను హీరోగా వెండితెరకు పరిచయం చేస్తోంది. యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ, 'గణేష్' హీరోగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'స్వాతిముత్యం' అనే పేరును నిర్ణయించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రంను కూడా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో కథానాయకుడు గణేష్ భుజాన బ్యాగ్ తో ఉండటం కనిపిస్తుంది.ఆకర్షణీయమైన లోగో తో కూడిన చిత్రం పేరు కనిపిస్తుంది. ఈరోజు చిత్ర కథానాయకుడు పుట్టినరోజు. ప్రచార చిత్రంలో ఈ విషయాన్ని కూడా గమనించవచ్చు.

'వర్ష బొల్లమ్మ' ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి.

ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ.

గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.