గౌతమీపుత్ర శాతకర్ణి క్లైమాక్స్ డీటైల్స్..

  • IndiaGlitz, [Wednesday,June 22 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వందో చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. మొరాకోలో జ‌రిగిన మొద‌టి షెడ్యూల్ లో 1000 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు, 200 గుర్రాలతో యుద్ధ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఆత‌ర్వాత హైద‌రాబాద్ లో చిత్రీక‌రించిన రెండో షెడ్యూల్లో కూడా యుద్ధ స‌న్నివేశాల‌నే చిత్రీక‌రించారు.
తాజా షెడ్యూల్ జులై 2నుంచి జార్జియాలో ప్రారంభించ‌నున్నారు. ఈ షెడ్యూల్ లో 22 రోజులు పాటు క్లైమాక్స్ యుద్ధ స‌న్నివేశాల‌ను భారీ స్ధాయిలో చిత్రీక‌రించ‌నున్నారు. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రియ న‌టిస్తుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్నిసంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

ఓం నమో వెంకటేశాయ షూటింగ్ ప్రారంభించేది ఆరోజే..

కింగ్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు-స్వరవాణి కీరవాణి ఈ ముగ్గురు కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ఓం నమో వెంకటేశాయ.

బ్రిటిష్ ఆత్మ‌కు - సౌతిండియ‌న్ ఆత్మ‌కు మ‌ధ్య ఫైటే ఈ దొర : స‌త్యరాజ్

స‌త్యరాజ్, శిబి స‌త్యరాజ్, బిందు మాధ‌వి ప్రధాన పాత్ర‌లో రూపొందిన త‌మిళ చిత్రం జాక్స‌న్  దొరై. ఈ చిత్రాన్ని ధ‌ర‌ణి ధ‌ర‌న్ తెర‌కెక్కించారు. త‌మిళ్ లో రూపొందిన ఈ హ‌ర్ర‌ర్ చిత్రాన్ని దొర టైటిల్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. జులై 1న దొర చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

మురుగుదాస్ మూవీలో న్యూలుక్ తో మ‌హేష్‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

చిరు సినిమాకు రచయితలెక్కువయ్యారా..?

దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత సినీ రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

'జనతాగ్యారేజ్' ఆడియో హైదరాబాద్ లో కాదా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివదర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్.