close
Choose your channels

బ్రిటిష్ ఆత్మ‌కు - సౌతిండియ‌న్ ఆత్మ‌కు మ‌ధ్య ఫైటే ఈ దొర : స‌త్యరాజ్

Tuesday, June 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స‌త్యరాజ్, శిబి స‌త్యరాజ్, బిందు మాధ‌వి ప్రధాన పాత్ర‌లో రూపొందిన త‌మిళ చిత్రం జాక్స‌న్ దొరై. ఈ చిత్రాన్ని ధ‌ర‌ణి ధ‌ర‌న్ తెర‌కెక్కించారు. త‌మిళ్ లో రూపొందిన ఈ హ‌ర్ర‌ర్ చిత్రాన్ని దొర టైటిల్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. జులై 1న దొర చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా స‌త్యరాజ్ మాట్లాడుతూ...హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలో నేను సౌత్ ఇండియ‌న్ ఆత్మ‌గా న‌టించాను. బ్రిటిష్ ఆత్మ‌కు, సౌత్ ఇండియ‌న్ ఆత్మ‌కు మ‌ధ్య పోటీ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుంది. ప్ర‌స్తుతం త‌మిళ్, తెలుగులో హ‌ర్ర‌ర్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఈ చిత్రం కూడా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రంలో మా అబ్బాయి శిబి స‌త్యరాజ్ హీరోగా న‌టించాడు. గ‌త ప‌దేళ్లుగా న‌టిస్తున్నాడు. తెలుగులో ఎన్టీఆర్ న‌టించిన స్టూడెంట్ నెం 1 త‌మిళ్ రీమేక్ ద్వారా మా అబ్బాయి హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు.

నేను 35 సంవ‌త్స‌రాల కెరీర్ లో దాదాపు 220 చిత్రాల్లో న‌టించాను. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన చిత్రాల్లో ఏ పాత్ర‌కు రానంత గుర్తింపు బాహుబ‌లి లో క‌ట్ట‌ప్ప పాత్ర‌కు ల‌భించింది. ఎంత‌గా గుర్తింపు వ‌చ్చింది అంటే...నా పేరు స‌త్యారాజ్ అని మ‌రిచిపోయి ఎక్క‌డికి వెళ్ళినా క‌ట్ట‌ప్ప అని పిలుస్తున్నారు. ఇటీవ‌ల వియ‌త్నాం మా ఫ్రెండ్ వెళితే..ఏ దేశం నుంచి వ‌చ్చార‌ని అడిగితే ఇండియా అని చెప్పాడ‌ట‌. వెంట‌నే వాళ్లు బాహుబ‌లి దేశ‌మా అన్నార‌ట‌. ఒక ఇండియ‌న్ సినిమా అందులోను తెలుగు సినిమా ఈస్ధాయిలో గుర్తింపు సాధించ‌డం...అందులో నేను న‌టించ‌డం అంత‌క‌న్నా ఒక న‌టుడుకు ఇంకేం కావాలి. బాహుబ‌లి 2 విష‌యానికి వ‌స్తే...బాహుబ‌లి చిత్రాన్ని మించి బాహుబ‌లి 2 ఉంటుంది. ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 షూటింగ్ జరుపుకుంటుంది. న‌వంబ‌ర్ వ‌ర‌కు షూటింగ్ జ‌రుగుతుంది. ఇలాంటి క్యారెక్ట‌ర్ చేసే అవ‌కాశం జీవితంలో ఒక‌సారి మాత్ర‌మే వ‌స్తుంది.

తెలుగులో మోహ‌న్ బాబు న‌టించిన య‌మ‌ధ‌ర్మ‌రాజు ఎం.ఎ త‌మిళ్ వెర్షెన్ లో నేను న‌టించాను. త‌మిళ‌నాడులో పొలిటిక‌ల్ సెటైర్ మూవీ అన్నా... నా గురించి మాట్లాడాల‌న్నా...నేను న‌టించిన ఈ చిత్రాన్నే చెబుతారు. ఇప్పుడు త‌మిళ‌నాడులో నా గురించి మాట్లాడాలంటే క‌ట్ట‌ప్ప క్యారెక్ట‌ర్ గురించే చెబుతున్నారు. ఇక‌ హాలీవుడ్ లో న‌టించే అవ‌కాశం వ‌స్తే...త‌ప్ప‌కుండా చేస్తాను. ప్ర‌స్తుతం ప‌టాస్ త‌మిళ‌ రీమేక్ లో సాయికుమార్ పాత్ర పోషిస్తున్నాను. తెలుగులో రామ్ - సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్నాను. ఈ చిత్రంలో రామ్ ఫాద‌ర్ గా న‌టిస్తున్నాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.