close
Choose your channels

రాజశేఖర్ హీరోయిన్‌గా ‘జార్జిరెడ్డి’ బ్యూటీ

Wednesday, March 3, 2021 • తెలుగు Comments

రాజశేఖర్ హీరోయిన్‌గా ‘జార్జిరెడ్డి’ బ్యూటీ

‘జార్జిరెడ్డి’ సినిమాతో హీరోయిన్‌గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ముస్కాన్ ఖుబ్చందాని. ఈ బ్యూటి అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మి’ సినిమా తర్వాత మరో అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. లలిత్ కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న ‘శేఖర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ‘శేఖర్’ కోసం సైన్ కూడా చేసేసినట్టు సమాచారం.

ముఖ్యంగా జార్జిరెడ్డి సినిమాలో ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫీల్డ్’ సాంగ్‌లో ముస్కాన్ నటనకు మేకర్స్ ముగ్దులయ్యారట. ఆమె చాలా గొప్ప డ్యాన్సర్ అని.. హావభావాలను అద్భుతంగా పలికిస్తుందని ‘శేఖర్’ మూవీ కో ప్రొడ్యూసర్ జీవిత తెలిపారు. బుల్లెట్ సాంగ్‌కి ముస్కాన్ పెర్ఫార్మెన్స్ చూసిన అనంతరం తనను కలిశానని.. తాము ‘శేఖర్’ స్క్రిప్ట్‌ను వివరించినప్పుడు ఆ రోల్‌ ప్రాముఖ్యాన్ని తాను అర్ధం చేసుకుని చాలా ఇష్టపడిందని జీవిత తెలిపారు.

రాజశేఖర్ హీరోయిన్‌గా ‘జార్జిరెడ్డి’ బ్యూటీ

అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అందంతో పాటు అద్భుతంగా నటించే వ్యక్తి కావాలని తాము భావించినట్టు జీవిత తెలిపారు. అంతేకాకుండా ఆమె ఎనర్జీ మాటల్లో చెప్పలేనిదని జీవిత పేర్కొన్నారు. ముస్కాన్ మార్చి నెల మధ్యలో జరగబోయే అరకు షెడ్యూల్ నుంచి షూటింగ్‌లో జాయిన్ అవుతుందని జీవిత తెలిపారు. మొత్తానికి ముస్కాన్ టాలీవుడ్‌లో మరో అవకాశాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ అవకాశం ముస్కాన్‌కు ఎంత మేర కలిసొస్తుందో వేచి చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz