Hyderabad: హైదరాబాద్‌లో దొంగల బీభత్సం : ప్రముఖ బుల్లితెర నటి ఇంట్లో భారీ చోరీ.. సొత్తు విలువ 70 లక్షల పైమాటే

  • IndiaGlitz, [Friday,April 21 2023]

హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచింగ్స్‌తో పాటు ఇళ్లలో చొరబడి ఊడ్చేస్తున్నారు. దీంతో జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా వీధుల్లోకి రావాలంటేనే జంకుతున్నారు. వేసవి కాలం కావడంతో చాలా మంది వూళ్లలో వుండటం లేదు. ఇలాంటి వారి ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు అందినకాడికి దోచేస్తున్నారు. వీరిలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా వుంటున్నారు. తాజాగా ప్రముఖ నటి సుమిత్ర ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఏకంగా 1.2 కిలోల బంగారం, 293 గ్రాముల వెండి వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. వీటి విలువ రూ.70 లక్షల పైనే వుంటుందని అంచనా.

ఢిల్లీ వెళ్లిన సుమిత్ర.. ఇదే అదనుగా దొంగల చోరీ :

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని క్యాప్రీ టవర్స్ ప్లాట్ నెంబర్ 501లో వుంటున్నారు సుమిత్రా. ఈ క్రమంలో ఏప్రిల్ 17న ఆమె ఢిల్లీ వెళ్లారు. అయితే అక్కడికి దగ్గరలో మరో ప్లాట్‌లో వుంటున్న తన సోదరుడు విజయ్ కుమార్‌కి సుమిత్ర ఇంటి తాళాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17 అర్ధరాత్రి దాటిన తర్వాత సుమిత్ర ఫ్లాట్ ప్రధాన ద్వారం వద్ద తాళం పగులగొట్టిన దుండగులు.. లోపల దాచిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తులను ఎత్తుకెళ్లారు. అయితే తర్వాతి రోజు దొంగతనం జరగడాన్ని గుర్తించిన ఇరుగుపొరుగు వారు.. సుమిత్ర సోదరుడు విజయ్ కుమార్‌కు తెలియజేశారు. దీంతో ఆయన హుటాహుటిన ఫ్లాట్‌కు వెళ్లి చూడగా అల్మారాలోని వస్తువులు చిందరవందరగా పడేసి వుండటంతో పాటు సొత్తు కనిపించలేదు. ఆ వెంటనే ఈయన విషయాన్ని ఢిల్లీలో వున్న సుమిత్రకు తెలిపారు.

రంగంలోకి పోలీసులు :

బుధవారం హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

More News

Shridi Sai:షిర్డీ సాయికి ‘నాణేల’ సమస్య.. ఇప్పటికే లాకర్లు ఫుల్, మాకొద్దు బాబోయ్ అంటోన్న బ్యాంక్‌లు

దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయి ఆలయానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.

Malli Pelli:'మళ్లీపెళ్లి' టీజర్ : సినిమానా, నరేశ్-పవిత్రా లోకేష్‌ల బయోపిక్కా.. జనాలకు ఏం చెప్పబోతున్నారు..?

పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్ వ్యవహారం టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను ఈ ఏడాది ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే.

Ravi Teja:ఖరీదైన కారు కొన్న మాస్ మహారాజా రవితేజ.. ధర, ఫీచర్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

మాస్ మహారాజా రవితేజ.. ఆయన పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో వుండరు.

Rahul Gandhi:పరువు నష్టం కేసు : రాహుల్‌కు మరో షాక్.. శిక్ష నిలుపుదల కుదరదన్న కోర్ట్, వాట్ నెక్ట్స్..?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కోర్టులో చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్‌లోని

Vande Bharat Express:ఘోరం : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న జింక .. అది మీదపడి మనిషి మృతి

దేశ ప్రజలకు సుఖవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు గాను రైల్వే శాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.