నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త..

  • IndiaGlitz, [Saturday,June 22 2019]

వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి గ్రామంలోనూ వాలంటీర్లను నియమించి అన్ని ప్రభుత్వ పథకాలను ఇంటికే చేర్చుతామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేసే క్రమంలో ఏపీ సర్కార్ అడుగులేస్తోంది. శనివారం సాయంత్రం గ్రామ వలంటీర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు విధివిధానాలతో ఏపీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేయడం జరిగింది. గ్రామ వాలంటీర్ల నియామకాల్లో స్థానికులకు అధిక అవకాశాలతో పాటు, 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తానని ఇది వరకే జగన్ స్పష్టం చేసిన విషయం విదితమే. కాగా.. ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ యువతీ యువకులకు ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్లను పాటిస్తూ ఈ నియామకాలు చేపడతారు.

అర్హతలు-నియామక షెడ్యూల్

దరఖాస్తుదారుడు అదే పంచాయతీలో నివసిస్తుండాలి
ఓసీ కానివాళ్లు తమ కులధ్రువీకరణ పత్రం సమర్పించాలి
గిరిజన ప్రాంతాల్లో 10వ తరగతి విద్యార్హత
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్
పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ అర్హత
వయసు నిబంధన: 2019 జూన్ 30 నాటికి 18-35 ఏళ్లు ఉండాలి
దరఖాస్తుల స్వీకరణ: జూన్ 24 నుంచి జూలై 5 వరకు
దరఖాస్తుల స్క్రూటినీ: జూలై 10 నుంచి
ఇంటర్వ్యూలు: జూలై 11 నుంచి 25 వరకు
అపాయిట్మెంట్ లెటర్స్ జారీ: ఆగస్టు 1న
ఎంపికైన గ్రామ వలంటీర్లకు ట్రయినింగ్: ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు
ఆగస్టు 1న గ్రామ వాలంటీర్ అభ్యర్థుల జాబితా ప్రకటన
ఆగస్టు 15నాటికి అమలులోకి గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ

More News

తపిస్తున్నా.. అవినీతిని సహించే పరిస్థితే లేదు!

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిని ఆస్కారం లేదన్న సందేశం పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు వెళ్లాలని..

'కౌసల్య కృష్ణమూర్తి' కూడా అంతటి పేరు తెస్తుంది - కె.ఎస్‌. రామారావు

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల తేదీ మార‌లేదు

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా మారింది. విశాల్ పాండ‌వ‌ర్ జ‌ట్టు, స్వామిశంక‌ర్ దాస్ జ‌ట్టు ఈసారి న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లో పోటీ ప‌డుతున్నాయి.

జులై మొదటి వారంలో 'కాకతీయుడు'

తారకరత్న హీరోగా నటించిన 'కాకతీయుడు' చిత్రం విడుదలకు సిద్ధమైంది. వి.సముద్ర దర్శకత్వంలో

వెంకటేష్ ప్రశంసలందుకున్న 'కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్' టీజ‌ర్

బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా నటిస్తొన్న చిత్రం  కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్.