మందుబాబులకు గుడ్‌న్యూస్.. లాక్‌డౌన్‌లోనూ డోర్ డెలివరీ!

  • IndiaGlitz, [Thursday,April 09 2020]

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో మద్యం ప్రియులు తెగ ఇబ్బంది పడుతున్నారు. దీంతో బార్‌లు తెరవండి లేదా హోమ్ డెలీవరి చేయాలనే డిమాండ్ యావత్ దేశ వ్యాప్తంగా పెరిగింది. మరోవైపు కల్లు, మద్యం దొరక్క చిత్రవిచిత్రాలుగా ప్రవర్తించడం, పిచ్చిపట్టి చాలా మంది ఆస్పత్రి పాలైన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో మందుబాబులకు మమత సర్కార్ (పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం) శుభవార్త తెలిపింది. మద్యాన్ని నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేయాలని సీఎం మమత బెనర్జీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా మూతబడిన మద్యం దుకాణాలను తెరవకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న వారికి షాపు ద్వారా డెలివరీ చేయనున్నారన్నదే ఆ నిర్ణయం సారాంశం.

అంతేకాదు.. ఇందుకోసం హోం డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీస్ స్టేషన్ల నుంచి పాస్‌లు జారీ చేస్తామని.. వాటిని చూపించి షాపుకు మూడు డెలివరీ పాస్‌లు మాత్రమే ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫోన్ల ద్వారా మద్యాన్ని ఆర్డర్ చేసుకుంటే సాయంత్రం ఐదు గంటలలోపు మద్యాన్ని డెలివరీ చేయనున్నట్టు ఎక్సైజ్ శాఖ తెలిపినట్లు వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి.

అదంతా అవాస్తవం..!

దీనిపై.. బెంగాల్ ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా స్పందిస్తూ.. ఎక్సైజ్ శాఖపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. మద్యం హోం డెలవరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తేల్చిచెప్పారు.ఎక్సైజ్ శాఖ చెప్పినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాగా.. ఇటీవలే స్వీట్ షాపులను పరిమిత సమయం అనుమతించినట్లుగానే మద్యం షాపులకు అనుమతులు ఇస్తారన్న చర్చ కూడా జోరందుకుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే దీదీ మీడియా ముందుకు రావాల్సిందే.

More News

'అన్నయ్య' హనుమాన్ ట్వీట్‌పై 'తమ్ముడు' రియాక్షన్ ఇదీ..

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టిన తర్వాత యమా యాక్టివ్‌గా ఉన్నారు. ఇటీవలే ఏప్రిల్-08తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పి..

ఎ.ఆర్‌.రెహ‌మాన్‌కి కోప‌మొచ్చింది

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మే ప్ర‌పంచంగా ఉంటారు. సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు ఆయ‌న సంద‌ర్భానుసారం మెసేజ్‌ల‌ను పోస్ట్ చేస్తుంటారు.

భారత్‌కు.. ఇండియన్స్‌కు కృతజ్ఞతలు..: ట్రంప్

అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ (యాంటీ-మలేరియా) ఔషధం ఎగుమతి విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ

మ‌రోసారి పెద్ద‌నాన్న సినిమాలో...?

మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడు మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు త‌న‌య నిహారిక కొన్ని వెబ్ సిరీస్‌ల్లో న‌టించిన త‌ర్వాత హీరో్యిన్‌గా కూడా కొన్ని సినిమాలు చేసింది.

బ‌న్నీపై ప‌వ‌న్ ఫ్యాన్స్ గుర్రు..!!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా క్యాంప్ హీరోలే అయినా ఓ సంద‌ర్భంలో ఇద్ద‌రి మ‌ధ్య చెడింది. నేను చెప్ప‌ను బ‌ద్ర‌ర్ అంటూ