Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'గుంటూరు కారం' బెనిఫిట్ షోకు గ్రీన్ సిగ్నల్..

  • IndiaGlitz, [Tuesday,January 09 2024]

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన గుంటూరు కారం'సినిమా. సంక్రాంతి పండుగ కానుకగా ఈనెల 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మూవీ ట్రైలర్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. ఇందులో మహేశ్ లుక్, డైలాగ్స్, డ్యాన్స్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. దీంతో మూవీని అందరికంటే ముందుగా చూసేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫ్యాన్స్‌కు శుభావర్త అందించింది.

బెన్‌ఫిట్ షోలో వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. సింగిల్ స్రీన్స్‌ల‌లో రూ.65, మ‌ల్టీఫెక్స్‌ల‌లో రూ.100 పెంచుకునే వెసులుబాటు క‌ల్పించింది. రాష్ట్రంలో 23 చోట్ల అర్థ‌రాత్రి ఒంటి గంట బెనిషిట్ షోకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. అంతేకాకుండా రోజుకు ఆరు షోలు వేసుకునేందుకు కూడా ఓకే చెప్పింది. దీంతో ఈ నెల 12 నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 4 గంట‌ల‌ నుంచే మూవీ షోలు బిగిన్ కానున్నాయి. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో పెద్ద పండుగ నాడు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇక ఈ సినిమాను హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మూవీలో మహేశ్‌ తల్లిగా రమ్యకృష్ణ, విలన్‌గా ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు, జయరామ్, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్ తదితర నటులు కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. గతంలో ఎన్నడూ కనిపించని మాస్ రోల్‌లో మహేశ్ ఇందులో కనిపించనున్నారు. దీంతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం రికార్డులు బద్ధలు కావాల్సిందే.

More News

YSRCP MP Candidates: వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. పలువురు సిట్టింగ్‌లకు షాక్..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల కేటాయింపుపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను

AP Politics: పార్టీలు మారిన నేతలపై పోటాపోటీ ఫిర్యాదులు.. రసవత్తరంగా ఏపీ రాజకీయాలు..

ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు రంజుగా మారుతోంది. ఎప్పుడూ ఏ పార్టీ నుంచి ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఊహించడం కష్టమవుతోంది. మరో రెండు నెలల్లో జరగనున్న

Vijayasai Reddy: ఏపీ, తెలంగాణ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి: విజయసాయి రెడ్డి

ఏపీతో పాటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల బృందాన్ని అభ్యర్థించారు. విజయవాడలో సీఈసీ బృందం

YS Jagan: నాడు వైయస్సార్.. నేడు వైయస్ జగన్.. సేమ్ సిట్యుయేషన్..

సింహాన్ని ఎదుర్కోవడానికి గుంటనక్కలన్ని ఒక్కటవుతున్నాయి. కానీ ఆ గుంటనక్కలకు తెలియదు ఏమిటంటే సింహాం గర్జన ముందు తట్టుకుని నిలబడలేవని..

Dil Raju: తనపై తప్పుడు వార్తలు రాసిన సినీ జర్నలిస్టుకు దిల్ రాజు వార్నింగ్.. వీడియో వైరల్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తనపై తప్పుడు వార్తలు రాసిన వారి తాటతీస్తా...