close
Choose your channels

Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'గుంటూరు కారం' బెనిఫిట్ షోకు గ్రీన్ సిగ్నల్..

Tuesday, January 9, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గుంటూరు కారం బెనిఫిట్ షోకు గ్రీన్ సిగ్నల్..

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన "గుంటూరు కారం'సినిమా. సంక్రాంతి పండుగ కానుకగా ఈనెల 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మూవీ ట్రైలర్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. ఇందులో మహేశ్ లుక్, డైలాగ్స్, డ్యాన్స్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. దీంతో మూవీని అందరికంటే ముందుగా చూసేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫ్యాన్స్‌కు శుభావర్త అందించింది.

Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గుంటూరు కారం బెనిఫిట్ షోకు గ్రీన్ సిగ్నల్..

బెన్‌ఫిట్ షోలో వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. సింగిల్ స్రీన్స్‌ల‌లో రూ.65, మ‌ల్టీఫెక్స్‌ల‌లో రూ.100 పెంచుకునే వెసులుబాటు క‌ల్పించింది. రాష్ట్రంలో 23 చోట్ల అర్థ‌రాత్రి ఒంటి గంట బెనిషిట్ షోకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. అంతేకాకుండా రోజుకు ఆరు షోలు వేసుకునేందుకు కూడా ఓకే చెప్పింది. దీంతో ఈ నెల 12 నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 4 గంట‌ల‌ నుంచే మూవీ షోలు బిగిన్ కానున్నాయి. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో పెద్ద పండుగ నాడు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గుంటూరు కారం బెనిఫిట్ షోకు గ్రీన్ సిగ్నల్..

ఇక ఈ సినిమాను హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మూవీలో మహేశ్‌ తల్లిగా రమ్యకృష్ణ, విలన్‌గా ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు, జయరామ్, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్ తదితర నటులు కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. గతంలో ఎన్నడూ కనిపించని మాస్ రోల్‌లో మహేశ్ ఇందులో కనిపించనున్నారు. దీంతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం రికార్డులు బద్ధలు కావాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.