నిర్మాత‌ల‌కు గుడ్‌న్యూస్‌... ఆన్ లైన్ సెన్సార్

  • IndiaGlitz, [Friday,May 15 2020]

క‌రోనా ప్ర‌భావంతో త‌ల్ల‌డిల్లుతోన్న సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఓ చిన్న ఊర‌ట దొరికింది. అదేంంటే జాతీయ సెన్సార్ బోర్డు సినిమాల‌కు ఆన్‌లైన్‌లో సెన్సార్ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డ‌మే. సాధార‌ణంగా సెన్సార్ స‌ర్టిపికేట్ కావాలంటే నెల‌రోజుల ముందు ఆన్‌లైన్‌లో అప్ల‌య్ చేసుకోవాలి. స‌ద‌రు సినిమా నిర్మాత సెన్సార్ బోర్డు ముందు హాజ‌రైతే సెన్సార్ స‌ర్టిఫికేట్ ల‌భించేంది. కానీ ఇప్పుడు రూట్ మారింది. జాతీయ సెన్సార్ బోర్డ్ కాస్త పెద్ద మ‌న‌సు చేసుకుంది. నిర్మాత‌ల క‌ష్టాలు తీర్చ‌డానికి సిద్ద‌మైంది. ఇప్పుడు ఓటీటీ కోసం కూడా సెన్సార్ అవ‌స‌రం అవుతుండ‌టంతో ఆన్‌లైన్‌లోనే సెన్సార్ అప్ల‌య్ చేసుకోమ‌ని బోర్డు తెలియ‌జేసింది.

అంతే కాకుండా మ‌రో బెనిఫిట్ కూడా సెన్సార్ బోర్డ్ నిర్మాత‌ల‌కు క‌లిగించింది. నిర్మాత సౌల‌భ్యం మేర‌కు ఎక్క‌డ షో వేస్తే అక్క‌డ‌కు సెన్సార్ బోర్డు స‌భ్యులు వ‌చ్చి సినిమా చూస్తారు. మెయిల్ ద్వారా సెన్సార్ స‌ర్టిఫికేట్‌ను జారీ చేస్తారు. ఇప్ప‌టికే చాలా మేర‌కు సినిమాలు సిద్ధంగా ఉండి సెన్సార్ కోసం వెయిట్ చేస్తున్న నిర్మాత‌లకు ఇది నిజంగా శుభ‌వార్తే. ఈ విష‌యంలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులకు అనుమ‌తి ఇస్తే తాము అన్నీ సిద్ధం చేసుకుని సెన్సార్ చేసుకుని క‌నీసం ఓటీటీకైనా సినిమాను ఇస్తామ‌ని భావిస్తున్న నిర్మాత‌లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వాల‌కు విజ్ఞ‌ప్తులు చేసుకుంటున్నారు.

More News

చిరంజీవిని డైరెక్ట్ చేయాలనుకుంటున్న డైరెక్టర్!!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాల‌ను చేస్తూ పోతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న యువ ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు.

బండ్ల గణేష్ వర్సెస్ హరీష్.. ముదురుతున్న వివాదం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా వచ్చిన ‘గబ్బర్ సింగ్‌’ సినిమా ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న విషయం విదితమే. ఈ సందర్భంగా సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్..

సబ్ కలెక్టర్‌గా పవన్ వీరాభిమాని.. ఫ్యాన్స్‌లో జోష్!

టాలీవుడ్‌లో పవర్ స్టార్.. రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. పవన్ అనే పేరు వింటే చాలు అభిమానులకు ఒక తెలియని ఉత్సాహం కలుగుతుంది.

అమెజాన్ ప్రైమ్ లో నేరుగా రిలీజ్ అవుతున్న కీర్తి సురేశ్ 'పెంగ్విన్'

మ‌హాన‌టి సినిమాతో ఎంత‌గానో పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకొని, తెలుగు ప్రేక్షకుల‌కి అత్యంత‌గా చేరువైన న‌టి కీర్తి సురేశ్. ఇటీవ‌లే నేష‌న‌ల్ అవార్డ్ ని కూడా కైవ‌సం చేసుకున్నారు. మ‌హాన‌టి

విజ‌య్ దేవ‌ర‌కొండ వెబ్‌సిరీస్‌

ఇప్పుడు వెండితెర‌కు ధీటుగా డిజిట‌ల్ రంగానికి ప్రాధాన్య‌త పెరుగుతుంది. ఇది వ‌ర‌కు ఉన్న ప్రాధాన్య‌త క‌రోనా వైర‌స్ కార‌ణంగా మ‌రింతగా పెరిగింది. దీంతో ప‌లువురు స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ అంద‌రూ వెబ్