బాల‌య్య టైటిల్‌తో గోపీచంద్‌

  • IndiaGlitz, [Saturday,June 08 2019]

టాలీవుడ్ యాక్ష‌న్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్‌కు ఈ మ‌ధ్య కాలంలో స‌రైన హిట్ ప‌డ‌లేదు. అవ‌కాశాలు వ‌స్తున్న గోపీచంద్ మాత్రం తొంద‌ర‌ప‌డ‌కుండా అవ‌కాశాల‌ను ఎంచుకోవ‌డంలో అచితూచి అడుగులు వేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ యాక్ష‌న్ హీరో తిరు ద‌ర్శ‌క‌త్వంలో, అనీల్ సుంక‌ర నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ జ‌రీనా ఖాన్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే పూర్తి చేసుకోనున్న ఈ సినిమాకు చిత్ర యూనిట్ టైటిల్ అన్వేష‌ణ‌లో ఉంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు 'బంగారు బుల్లోడు' అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇదే టైటిల్‌తో ఇది వ‌ర‌కు నంద‌మూరి బాల‌కృష్ణ సూప‌ర్‌డూప‌ర్ హిట్ అందుకున్నాడు. మ‌ళ్లీ గోపీచంద్ టైటిల్‌తో హిట్ సాధిస్తాడేమో చూడాలి.