'పెన్సిల్ ' హీరోగా తెలుగులో నాకు మంచి బ్రేక్ నిచ్చే సినిమా అవుతుంది - హీరో జి.వి.ప్రకాష్

  • IndiaGlitz, [Wednesday,May 11 2016]

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన జి.వి.ప్రకాష్‌, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, బస్‌స్టాప్‌, కేరింత, మనసారా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన శ్రీదివ్య జంటగా మణి నాగరాజ్‌ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'పెన్సిల్‌'. ఎం.పురుషోత్తం సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై సక్సెస్‌ఫుల్‌ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి.ప్రకాష్‌కుమార్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై పెద్ద సక్సెస్‌ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 13న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా...
హీరో, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్‌ మాట్లాడుతూ - ''ఇటీవల విడుదలైన మా 'పెన్సిల్‌' ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే థియేటర్‌ ట్రైలర్‌కి కూడా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రంలోని అన్ని పాటల్ని శ్రీమణిగారు చాలా అద్భుతంగా రాశారు. ఇందులో 'రెండే కళ్ళు..' అనే పాట నాకు బాగా నచ్చింది. అన్ని పాటలూ మీకు బాగా నచ్చుతాయని ఆశిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ హరిగారు నిర్మాతగా మారుతున్నారు. నిర్మాత హరిగారికి కంగ్రాట్స్‌ తెలియజేస్తున్నాను. ఈ సినిమా మీ స్కూల్‌ లైఫ్‌ని, మీ చిన్న నాటి మధుర స్మృతుల్ని మళ్ళీ మీ ముందుకు తెస్తుంది. మే 13న విడుదలవుతున్న ఈ చిత్రం నాకు తెలుగులో హీరోగా మంచి బ్రేక్‌నిస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత, నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ''యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకొని మా 'పెన్సిల్‌' చిత్రం పెద్ద హిట్‌అ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసేలా ఈ చిత్రం రూపొందింది. జ.వి.ప్రకాష్‌కి హీరోగా మంచి పేరు తెచ్చే సినివమా అవుతుంది. మే 13న రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.

More News

మే 20న మంచు లక్ష్మి ప్రసన్న కొత్త చిత్రం ప్రారంభం

మంచు వారసురాలిగా,నటిగా,నిర్మాతగా,సింగర్ గా,యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని నటన పరంగా విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్న మంచు లక్ష్మి

నిన్న విజయ్..నేడు ఎన్టీఆర్..రేపు అజిత్...

మలయాళంలో సూపర్ స్టార్ ఆయన.ఐదు పదులు దాటినా కలెక్షన్లు రాబట్టడంలో తన సత్తానే వేరు.

కాజల్ తోనైనా లెక్క మారుతుందా?

ట్రెండ్ సెట్టింగ్ సినిమాతో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన ఘనత ఆయనది.ఆ తరువాత కూడా రెండు సంచలన విజయాలను నమోదు చేసుకున్నప్పటికీ వరుస పరాజయాలు అతని హవాకి బ్రేక్ వేశాయి.

నవీన్ చంద్ర 'చందమామ రావే'

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యి యూత్ హర్ట్ ని దొచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రానికి చందమామ రావే అనే టైటిల్ ని ఖరారు చేశారు.

'ప్రేమమ్ ' కి అదో ప్లస్

మలయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్'..తెలుగులో అదే పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్,అనుపమ పరమేశ్వరన్,మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.