H3N2:భారత్‌లో చాపకింద నీరులా హెచ్‌3ఎన్2 వైరస్.. భారీగా పెరుగుతోన్న ఫ్లూ కేసులు, లక్షణాలివే

  • IndiaGlitz, [Wednesday,March 08 2023]

దాదాపు మూడేళ్ల పాటు ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. చైనా, తదితర దేశాలు మినహా మిగిలిన చోట కోవిడ్ ప్రభావం లేదు. ఈ ముప్పు పోయిందని భారతీయులు ఊపిరి పీల్చుకుంటుండగా.. ఇప్పుడు ఫ్లూ వణికిస్తోంది. జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు ప్రజలను కంగారు పెడుతున్నాయి. కరోనా లక్షణాల మాదిరే ఈ ఫ్లూ కేసులు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. దీనికి హెచ్3ఎన్2 వైరస్ కారణమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫ్లూ కేసులపై ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఈ ఫ్లూ కూడా నోటి తుంపర్ల రూపంలో కరోనా మాదిరగానే వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో ప్రజలంతా జాగ్రత్తగా వుండాలని గులేరియా సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు మరింత అప్రమత్తంగా వుండాలని ఆయన హెచ్చరించారు. రోగ నిరోధ శక్తి తక్కువగా వున్న వారు దీని ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారని రణదీప్ అన్నారు. అయితే ఆసుపత్రిలో భారీ చేరికలు లేకపోవడం శుభపరిణామమన్నారు. వాతావరణంలో వచ్చే మార్పులు, కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించకపోవడం ఇందుకు కారణమని గులేరియా వెల్లడించారు.

హెచ్3ఎన్2 లక్షణాలు:

ఎడతెరిపి లేని దగ్గు
జ్వరం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
వికారం
వాంతులు
గొంతునొప్పి
ఒళ్లు నొప్పులు
విరేచనాలు

ఫ్లూ బారినపడకుండా జాగ్రత్తలు:

తరచూ చేతులను సబ్బు నీటితో శుభ్రం చేసుకోవడం
మాస్క్ ధరించాలి, రద్దీ ప్రదేశాల్లో తిరగొద్దు
నోటిని, ముక్కును చేతులతో పదే పదే తాకొద్దు
పెద్ద మొత్తంలో ద్రవాలు తీసుకోవాలి
షేక్ హ్యాండ్ ఇవ్వడం, హాగ్ చేసుకోవడం వద్దు
జ్వరం, ఒళ్లునొప్పులు ఎక్కువగా వుంటే పారాసిటమాల్ వేసుకోవాలి
 

More News

Lal Salaam:సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో ‘లాల్ స‌లాం’.. రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

పాన్ ఇండియా ఆశ్చ‌ర్య‌పోయేలా భారీ బ‌డ్జెట్  విజువ‌ల్ వండ‌ర్స్ చిత్రాలే కాదు..

Geeta Sakshigaa:మార్చి 22న 'గీత సాక్షిగా' రిలీజ్

నిజ ఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోష‌న‌ల్ డ్రామా ‘గీత సాక్షిగా’.

'జస్ట్ ఏ మినిట్' మూవీ మోషన్ పోస్టర్

రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కార్తీక్ ధర్మపురి సహకారంతో ‘పూర్ణస్ యస్వంత్’ దర్శకత్వం వహిస్తున్నారు.

Ram Charan : మరోసారి హిందీలో చరణ్ చిత్రం.. ఏకంగా సల్మాన్‌ఖాన్‌తో కలిసి, మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో గతేడాది ప్రేక్షకులను పలకరించారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్.

Poonam Kaur : నేనూ మీ బిడ్డనే.. నన్ను వెలి వేయకండి.. రాజ్‌భవన్ సాక్షిగా పూనమ్ కౌర్ కంటతడి

వివక్ష.. ఇది అన్ని రంగాల్లో వినిపించే మాటే. కులం, మతం, ప్రాంతం, రంగు, రూపం ఇలా అన్నింట్లో పురుషులు, స్త్రీలు సమానంగా వివక్షను ఎదుర్కొంటున్నారు.