close
Choose your channels

H3N2:భారత్‌లో చాపకింద నీరులా హెచ్‌3ఎన్2 వైరస్.. భారీగా పెరుగుతోన్న ఫ్లూ కేసులు, లక్షణాలివే

Wednesday, March 8, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దాదాపు మూడేళ్ల పాటు ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. చైనా, తదితర దేశాలు మినహా మిగిలిన చోట కోవిడ్ ప్రభావం లేదు. ఈ ముప్పు పోయిందని భారతీయులు ఊపిరి పీల్చుకుంటుండగా.. ఇప్పుడు ఫ్లూ వణికిస్తోంది. జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు ప్రజలను కంగారు పెడుతున్నాయి. కరోనా లక్షణాల మాదిరే ఈ ఫ్లూ కేసులు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. దీనికి హెచ్3ఎన్2 వైరస్ కారణమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫ్లూ కేసులపై ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఈ ఫ్లూ కూడా నోటి తుంపర్ల రూపంలో కరోనా మాదిరగానే వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో ప్రజలంతా జాగ్రత్తగా వుండాలని గులేరియా సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు మరింత అప్రమత్తంగా వుండాలని ఆయన హెచ్చరించారు. రోగ నిరోధ శక్తి తక్కువగా వున్న వారు దీని ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారని రణదీప్ అన్నారు. అయితే ఆసుపత్రిలో భారీ చేరికలు లేకపోవడం శుభపరిణామమన్నారు. వాతావరణంలో వచ్చే మార్పులు, కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించకపోవడం ఇందుకు కారణమని గులేరియా వెల్లడించారు.

హెచ్3ఎన్2 లక్షణాలు:

ఎడతెరిపి లేని దగ్గు
జ్వరం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
వికారం
వాంతులు
గొంతునొప్పి
ఒళ్లు నొప్పులు
విరేచనాలు

ఫ్లూ బారినపడకుండా జాగ్రత్తలు:

తరచూ చేతులను సబ్బు నీటితో శుభ్రం చేసుకోవడం
మాస్క్ ధరించాలి, రద్దీ ప్రదేశాల్లో తిరగొద్దు
నోటిని, ముక్కును చేతులతో పదే పదే తాకొద్దు
పెద్ద మొత్తంలో ద్రవాలు తీసుకోవాలి
షేక్ హ్యాండ్ ఇవ్వడం, హాగ్ చేసుకోవడం వద్దు
జ్వరం, ఒళ్లునొప్పులు ఎక్కువగా వుంటే పారాసిటమాల్ వేసుకోవాలి
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.