హ‌న్సిక క్యారెక్ట‌ర్‌....

  • IndiaGlitz, [Tuesday,January 26 2016]

సిద్ధార్థ్‌, త్రిష‌, హ‌న్సిక హీరో హీరోయిన్లుగా సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం క‌ళావ‌తి. ఈ చిత్రం జ‌నవ‌రి 29న విడుద‌ల‌వుతుంది. హ‌ర్ర‌ర్ కామెడి చంద్ర‌క‌ళ‌కు సీక్వెల్‌గా రూపొందిన ఈచిత్రంలో హ‌న్సిక గ‌ర్భ‌వ‌తి పాత్ర‌లో న‌టిస్తుంద‌ట‌. ఆరునెల‌ల గ‌ర్భ‌వ‌తిగా చేయ‌డం త‌న‌కు ఇదే మొద‌టిసారి కాబ‌ట్టి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని న‌టించాను.

కొన్ని సీన్స్‌లో నేను న‌టించ‌డం చూసి మా అమ్మ‌గారు ఎమోష‌న‌ల్ అయ్యారు. చాలా కొత్త‌గా అనిపించిందంటూ హ‌న్సిక ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతే కాకుండా త‌న వ‌ర్క్ గురించి మాట్లాడితేనే తాను స్పందిస్తాన‌ని, ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాట్లాడ‌న‌ని చెప్పింది. ఈ విష‌యం శింబును దృష్టిలో ఉంచుకుని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

More News

కేర‌ళలో స‌ర్ధార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. బాబీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

'శౌర్య' ఆడియో రిలీజ్ డేట్...

మంచు మనోజ్‌, రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై  దశరథ్‌ దర్శకత్వంలో శివకుమార్‌ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం ‘శౌర్య’’. థ్రిల్లర్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ డైరెక్ట‌ర్..

బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ డైరెక్ట‌ర్..ఎవ‌రో కాదు అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌. టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన హ్యాపీడేస్ మూవీని   బాలీవుడ్ లో రీమేక్  చేయాల‌ని..ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు శేఖ‌ర్ క‌మ్ముల‌.

'శ్రీమంతుడు' కొత్త రికార్డ్‌....

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు వ‌న్ నేనొక్క‌డినే, ఆగ‌డు చిత్రాల ఫెయిల్యూర్స్ త‌ర్వాత ‘శ్రీమంతుడు’ భారీ విజ‌యాన్నే క‌ట్ట‌బెట్టింది.

తాప్సీ పాత్ర ఏంటంటే...

ద‌గ్గుబాటి రానా హీరోగా హిందీ, త‌మిళం, తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఘాజీ’. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.