అయ్యో పాపం.. హ‌న్సిక‌

  • IndiaGlitz, [Wednesday,April 06 2016]

తెలుగులో ఒక్క‌టంటే ఒక్క సినిమా లేదు కానీ త‌మిళంలో మాత్రం బిజీ హీరోయిన్‌గా మారింది హ‌న్సిక‌. గ‌త నాలుగేళ్లుగా అక్క‌డ పాగా వేసిన ఈ సుంద‌రికి ఆరంభంలో విజయాలు ద‌క్కాయి. అయితే ఈ మ‌ధ్య మాత్రం అమ్మ‌డికి కొత్త చిత్రాల ఫ‌లితాలు నిరాశ‌నే మిగులుస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వ‌చ్చిన 'క‌ళావ‌తి' త‌మిళ వెర్ష‌న్ 'అర‌ణ్‌మ‌నై 2' మిన‌హాయిస్తే ఆ త‌రువాత వ‌చ్చిన 'పోక్కిరి రాజా' గానీ, 'ఇష్క్' రీమేక్ 'ఉయిరే ఉయిరే' గానీ స‌క్సెస్‌ని అందివ్వ‌లేక‌పోయాయి.

దీంతో రెండు వ‌రుస ప‌రాజ‌యాల భారాన్ని హ‌న్సిక మోయాల్సివ‌చ్చిన‌ట్ల‌య్యింది. ఈ నెలాఖ‌రులో 'ఓకే ఓకే' కోసం త‌న‌కి కలిసొచ్చిన ఉద‌య‌నిధి స్టాలిన్‌తో జ‌త‌క‌ట్టిన 'మ‌ణిద‌న్' విడుద‌ల కానుంది. ఈ సినిమా అయినా ఆమెకు హిట్‌నిస్తే స‌రి.. లేదంటే అక్క‌డ అమ్మ‌డి కెరీర్ క్లైమాక్స్‌కి చేరుకున్న‌ట్టే. అదే జ‌రిగితే హ‌న్సిక మ‌ళ్లీ టాలీవుడ్‌కి రాక త‌ప్ప‌దు. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

More News

అఖిల్ సెకండ్ మూవీ ఎనౌన్స్ మెంట్ ఆరోజే..

అక్కినేని అఖిల్ తొలి చిత్రం ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోవడంతో...ద్వితీయ చిత్రం పైనే అందరి ఆశలు.

'గరుడ' ఆలస్యమవుతుంది...

తెలుగులో రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న గరుడ సినిమా కాదు..తమిళంలో చియాన్ విక్రమ్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కనున్న గరుడ

నితిన్ అ ఆ వాయిదా..

నితిన్, సమంత జంట‌గా న‌టిస్తున్న‌ చిత్రం  అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

యాంకర్ జయతి ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం లచ్చి..

వెన్నెల ప్రొగ్రామ్ ద్వారా పాపులర్ అయిన యాంకర్ జయతి కధానాయికగా నటిస్తూ...నిర్మిస్తున్న చిత్రం లచ్చి.

'24' చిత్రం నాకు మంచి బ్రేక్ ఇస్తుంది - అజయ్

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో విలన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలను పోషించిన నటుడు అజయ్.