కథా చౌర్యం జరిగిందా? 

  • IndiaGlitz, [Monday,April 22 2019]

తమిళ స్టార్‌ హీరోల్లో ఒకరైన విజయ్‌ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథను దర్శకుడు అట్లీ చోరీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పుట్‌బాల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా కథ తనదంటూ సెల్వ అనే షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ కోర్టుకెక్కాడు. తాను ఫుట్‌ బాల్‌ నేపథ్యంలో 265 పేజీల కథను రాసుకున్నానని సెల్వ తెలిపారు.

పలువురికి తన కథను వినిపిస్తున్న సందర్భంలో.. తన కథతోనే విజయ్‌, అట్లీ సినిమా తెరకెక్కుతోందని తెలిసి షాకయ్యానని ఆయన అన్నారు. అసలు విషయం తేలే వరకు సినిమా షూటింగ్‌ను ఆపాలంటూ సెల్వ కోర్టులో కేసు వేశారు. మంగళవారం ఈ కేసుపై విచారణ జరగనుంది. మరి దర్శక నిర్మాతలు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

తెరి, మెర్సల్‌ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్‌, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. భారీ అంచనాలతో.. భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్‌గా 6 కోట్ల రూపాయల ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ సెట్‌ కూడా వేయడం విశేషం. ఇందులో నయనతార హీరోయిన్‌. ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

More News

శ్రీలంక బాంబు దాడిలో తృటిలో తప్పించుకున్న టీడీపీ నేత 

శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లు ఈస్టర్‌డే నాడు రక్తపాతాన్నిసృష్టించాయి. ఈ నరమేధంలో వందలాదిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరెంతో మంది క్షతగాత్రులయ్యారు.

జీవీఎల్, విజయసాయిపై బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు

మే-23 తర్వాత వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి చెప్పు దెబ్బలు తప్పవని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

నిత్యం ప్రజలకు సేవ చేయడమే జనసేన చెప్పే థ్యాంక్స్

మనస్ఫూర్తిగా, నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయడమే ప్రజలకు మన పార్టీ  చెప్పే నిజమైన కృతజ్ఞత అవుతుంని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

శ్రీలంకలో మారణహోమం వెనుక ఐసిస్ హస్తం!

శ్రీంలక రాజధాని కొలంబోలో జరిగిన ఘటన వెనుక ఉగ్రవాద సంస్థ ఐసిస్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది!.

బుల్లితెర‌పై

ఒకప్పుడు వినోదం అంటే సినిమానే. ఆ తర్వాత అనేక మాధ్యమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ వస్తున్నాయి.