close
Choose your channels

Chandrababu:దళితులంటే ద్వేషం.. పేదలంటే చులకన.. మారని చంద్రబాబు వైఖరి..

Saturday, March 30, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. గత ఎన్నికల్లో దళితులందరూ కలిసి బుద్ధి చెప్పినా ఇంకా బాబుకు బుద్ధి రాలేదు. ఇప్పుడు కూడా అదే అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నారు. దళితులంటేనే చంద్రబాబుకు తొలి నుంచి చులకన. దళిత, అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదగడం అసలు ఇష్టం లేని చంద్రబాబు అవసరం వచ్చినప్పుడల్లా వారిని అవమానిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సింగనమల నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న టిప్పర్ డ్రైవర్ రామాంజనేయులు, మడకశిరకు చెందిన ఉపాధిహామీ కూలీ లక్కప్ప గురించి చులకనగా మాట్లాడారు.

అత్యంత సామాన్యులను చట్టసభలకు పంపడం ద్వారా తనకు పేదలు అంటే ఎంత ముఖ్యమో సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. గతంలో ఇలాగే సాధారణ వ్యక్తులైన మాధవి, నందిగం సురేష్‌లను ఎంపీలుగా గెలిపించడం ద్వారా తాను పేదలు, అణగారిన వర్గాల పక్షపాతిని అని చాటి చెప్పారు. ఇప్పుడు కూడా పేదవర్గాలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించి తన వైఖరిని మరోసారి చాటి చెప్పారు. అయితే ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు అవహేళన చేయడం మొదలుపెట్టారు. ఒక టిప్పర్ డ్రైవరుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా అని బాబు చేసిన వ్యాఖ్యలపై దళిత వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి డబ్బున్న పెత్తందారులకు చంద్రబాబు టిక్కెట్లు ఇప్పించుకుంటారు కానీ సీఎం జగన్ మాత్రం సాధారణ కార్యకర్తలను అభ్యర్థులుగా ప్రకటించకూడదు అంటున్నారు. అయితే పేద వాళ్లను అభ్యర్థులుగా ప్రకటించి కొత్త రాజకీయ చరిత్రను లిఖిస్తున్నారని ప్రజలు అంటున్నారు. వాస్తవానికి సింగనమల అభ్యర్థి వీరాంజనేయులు ఎంఏ, బీఈడీ చదివారు. కానీ చంద్రబాబు మూడుసార్లు సీఎంగా ఉన్న సమయంలో ఉద్యోగావకాశాలు లేక కుటుంబ పోషణార్థం టిప్పర్ డ్రైవర్‌గా పని చేయాల్సి వచ్చింది.

వాస్తవానికి అయన చంద్రబాబు కన్నా ఎక్కువ విద్యార్హతలు వీరాంజనేయులు ఆర్జించారు. కానీ ఉద్యోగం దక్కలేదు. అలాంటి దళిత అభ్యర్థి పట్ల బాబు చేసిన వ్యాఖ్యలు రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఇబ్బందిని కలిగించక తప్పదని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. బడగు, బలహీన వర్గాల నుంచి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

 

 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.