నటుడిగా ఎలాంటి పాత్రలనైనా చేయడానికి సిద్ధం - హవీష్

  • IndiaGlitz, [Saturday,June 24 2017]

అమెరికాలో చ‌దువు పూర్తి చేసుకుని వ‌చ్చిన త‌ర్వాత చిన్నికృష్ణ‌గారితో సినిమా చేయాల్సింది కానీ కుద‌ర‌లేదు. సినిమాల్లో న‌టించాల‌నే ఆస‌క్తి బ‌లంగా ఉండ‌టంతో స‌త్యానంద్‌గారి ద‌గ్గ‌ర ఆరు నెల‌లు పాటు శిక్ష‌ణ తీసుకున్నాను. త‌ర్వాత 'నువ్విలా', 'రామ్‌లీల', 'జీనియస్‌' వంటి చిత్రాల్లో న‌టించాన‌ని అన్నారు హీరో హ‌వీష్‌. ఒక వైపు వ్యాపారం, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకెళుతున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు. ప్రస్తుతం హవీష్‌ హీరోగా జవహర్‌బాబు, రమేష్‌ వర్మ నిర్మాతలుగా ఓ సినిమా రూపొందుతుంది. సాయి అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పుడు సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కథ నచ్చితేనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు జవహర్‌బాబుగారు, రమేష్‌వర్మగారు సంయుక్తంగా నిర్మించే సినిమాలో నటిస్తున్నాను. సాయి అనే కొత్త దర్శకుడు సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇది కామెడి థ్రిల్లర్‌. ఇందులో కథే హీరో. నా క్యారెక్టరైజేషన్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. తెలుగు, తమిళంలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్స్‌ చేస్తున్నారు. కమర్షియల్‌గా సినిమా ఆడియెన్స్‌ను అలరిస్తుంది. జవహర్‌బాబుగారి ప్రొడక్షన్‌లోనే నా నెక్స్‌ట్‌ మూవీ కూడా ఉంటుంది. నటుడిగా ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధం. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు చేస్తాను. వేరే హీరోలున్న సినిమాలో ఇప్పట్లో నటించనని తెలిపారు హీరో హ‌వీష్‌.

More News

బన్ని సినిమాలో నాని హీరోయిన్..

జెంటిల్మన్ సినిమాలో గ్లామర్తో పాటు అభినయంతో ఆకట్టుకుంది హీరోయిన్ నివేదా థామస్. ఇప్పుడు జై లవకుశ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన నటిస్తుంది.

మోహన్ బాబు దర్శకత్వం చేస్తున్నాడా..?

600పైగా చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా నటించిన మోహన్బాబు త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో విష్ణు హీరోగా నటిస్తాడనే వార్తలు వినపడుతున్నాయి.

రెండవ షెడ్యూల్ 'సోడా గోలిసోడా'

ఎస్.బి ఆర్ట్ క్రియోషన్స్ బ్యానర్ పై భువనగిరి సత్య సింధూజ నిర్మాత గా మెట్టమెదటిసారిగా నిర్మిస్తున్న చిత్రం సోడా గోలి సోడా.. ఉబయగోదావరి జిల్లాల్లో అమలాపురం, పాలకొల్లు లాంటి అందమైన ప్రదేశాల్లో మెదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రెండ షెడ్యూల్ జరుపుకుంటుంది.

క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంది..

తమిళ హీరోయిన్ నయనతారకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో దాదాపు అందరు అగ్రహీరోలు నయనతారతో నటించినవారే. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

శృతిని వారే వద్దని అనుకున్నారట...

బాహుబలి తర్వాత దక్షిణాదిన ప్రకటించిన మరో భారీ చిత్రం సంఘమిత్రం. శృతిహాసన్ టైటిల్ పాత్రలో నటించడానికి రెడీ అయిపోయంది. సినిమా కోసమని లండన్లో కత్తిసాములో శిక్షణ కూడా తీసుకుంది.