close
Choose your channels

నటుడిగా ఎలాంటి పాత్రలనైనా చేయడానికి సిద్ధం - హవీష్

Saturday, June 24, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమెరికాలో చ‌దువు పూర్తి చేసుకుని వ‌చ్చిన త‌ర్వాత చిన్నికృష్ణ‌గారితో సినిమా చేయాల్సింది కానీ కుద‌ర‌లేదు. సినిమాల్లో న‌టించాల‌నే ఆస‌క్తి బ‌లంగా ఉండ‌టంతో స‌త్యానంద్‌గారి ద‌గ్గ‌ర ఆరు నెల‌లు పాటు శిక్ష‌ణ తీసుకున్నాను. త‌ర్వాత 'నువ్విలా', 'రామ్‌లీల', 'జీనియస్‌' వంటి చిత్రాల్లో న‌టించాన‌ని అన్నారు హీరో హ‌వీష్‌. ఒక వైపు వ్యాపారం, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకెళుతున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు. ప్రస్తుతం హవీష్‌ హీరోగా జవహర్‌బాబు, రమేష్‌ వర్మ నిర్మాతలుగా ఓ సినిమా రూపొందుతుంది. సాయి అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పుడు సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కథ నచ్చితేనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు జవహర్‌బాబుగారు, రమేష్‌వర్మగారు సంయుక్తంగా నిర్మించే సినిమాలో నటిస్తున్నాను. సాయి అనే కొత్త దర్శకుడు సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇది కామెడి థ్రిల్లర్‌. ఇందులో కథే హీరో. నా క్యారెక్టరైజేషన్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. తెలుగు, తమిళంలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్స్‌ చేస్తున్నారు. కమర్షియల్‌గా సినిమా ఆడియెన్స్‌ను అలరిస్తుంది. జవహర్‌బాబుగారి ప్రొడక్షన్‌లోనే నా నెక్స్‌ట్‌ మూవీ కూడా ఉంటుంది. నటుడిగా ఎలాంటి పాత్రలైనా చేయడానికి సిద్ధం. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు చేస్తాను. వేరే హీరోలున్న సినిమాలో ఇప్పట్లో నటించనని తెలిపారు హీరో హ‌వీష్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.