'హలో గురు ప్రేమ కోసమే' సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే..

  • IndiaGlitz, [Friday,May 18 2018]

రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ‘నేను లోకల్’ లాంటి హిట్ మూవీని తెరకెక్కించిన త్రినాథరావు నక్కిన ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించ‌నున్నాడ‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్రకారం.. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక‌య్యాడ‌ని తెలిసింది. ఇప్ప‌టికే రామ్, త‌మ‌న్ కాంబినేష‌న్‌లో ‘కందిరీగ’, 'మ‌సాలా', 'పండ‌గ చేస్కో' చిత్రాలు రాగా.. వీటిలో 'కందిరీగ' మాత్ర‌మే విజ‌యం సాధించింది. కాగా.. త‌మ‌న్ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌టన రావాల్సి ఉంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.

More News

స్మగ్లర్‌గా న‌య‌న‌తార‌

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ఎంపిక చేసుకుంటూ.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందులో 'ఇమైక్క నోడిగల్' సినిమా

పేద క్రీడాకారుల కోసం 'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత

6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు.

'బొమ్మ‌రిల్లు' విడుద‌ల తేది టార్గెట్‌గా..

నితిన్, రాశిఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'.  'శతమానం భవతి' ఫేమ్‌ సతీష్ వేగేశ్న ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

రవితేజ, శ్రీను వైట్ల సినిమాలో స్టార్ కమెడీయన్లు

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేష‌న్ సినిమా అంటే.. అందులో కామెడీకే పెద్ద పీట వేస్తారన్న విష‌యం తెలిసిందే.

ఈ నెల విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న 'నా నువ్వే'

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `నా నువ్వే`.