close
Choose your channels

రవితేజ, శ్రీను వైట్ల సినిమాలో స్టార్ కమెడీయన్లు

Friday, May 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రవితేజ, శ్రీను వైట్ల సినిమాలో స్టార్ కమెడీయన్లు

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేష‌న్ సినిమా అంటే.. అందులో కామెడీకే పెద్ద పీట వేస్తారన్న విష‌యం తెలిసిందే. గతంలో వీరి కలయికలో వచ్చిన 'వెంకీ', 'దుబాయి శీను' చిత్రాలే అందుకు ఉదాహరణ.

తాజాగా వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో కూడా పంచ్ డైలాగులతో సాగే కామెడీ ఉండేలా చూసుకుంటున్నారు దర్శకుడు. అందుకు తగ్గట్టుగానే తెలుగులో స్టార్ కమెడీయన్‌లైన శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, 'వెన్నెల' కిషోర్ వంటి వారిని ఈ చిత్రంలో తీసుకున్నారు. ప్రస్తుతం వీరిపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇప్పటికే అమెరికాలో పలు ఖరీదైన లొకేషన్‌లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో.. రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్ ఆడిపాడనుంది. తమన్ స్వరాలను అందిస్తున్నారు.

కాగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీనువైట్ల ఈ సినిమాతో పూర్వ వైభవాన్ని పొంద‌డానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.