పేలుళ్ల నుంచి క్షేమంగా బయటపడ్డ హీరోయిన్ సోదరుడు

  • IndiaGlitz, [Sunday,April 21 2019]

శ్రీలంకలో ఆదివారం ఉదయం వరుస బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 160 మందికి పైగా ఘటనాస్థలిలోనే కన్నుమూయగా.. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. పేలుళ్లతో అలెర్టయిన మరికొందరు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పరుగులు తీసి క్షేమంగా బయటపడ్డారు. ఇదిలా ఉంటే గంట గంటకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు సమాచారం. 

సంజన సోదరుడు సేఫ్!

వివరాల్లోకెళితే.. టాలీవుడ్‌ హీరోయిన్ సంజన సోదరుడు రాహుల్ శెట్టి ఈ పేలుళ్లు జరిగినప్పుడు కొలంబోలో ఉన్నాడు. అయితే విషయం తెలుసుకున్న సంజన.. సోదరుడికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంది. తాను ఈ ఘటన నుంచి క్షేమంగా బయటపడ్డానని ఆయన చెప్పడంతో సంజన కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. దేవుడి దయవల్ల మా సోదరుడు రాహుల్ క్షేమంగా బయటపడ్డాడని సంజన మీడియాకు సమాచారం అందించింది. ఇలా పేలుళ్లు జరగడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఆ దేవుడే సరైన శిక్ష విధిస్తాడన్నది. కాగా.. ఈ ప్రమాదం జరిగినప్పుడు రాహుల్ సెయింట్‌ ఆంటోనీ ప్రాంతానికి సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.

More News

రాధిక‌కు త‌ప్పిన ముప్పు

సీనియ‌ర్ న‌టి రాధిక‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈమె వ్య‌క్తిగ‌త ప‌నుల రీత్యా శ్రీలంకకు వెళ్లారు. అక్క‌డ సిన్నామ‌న్ గ్రాండ్ హోట‌ల్‌లో బ‌స చేశారు.

హిందీ 'కాంచ‌న' టైటిల్‌

న‌టుడు, కొరియోగ్రాఫ‌ర్, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు.. ఇలా త‌నకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు రాఘ‌వ లారెన్స్‌. హార‌ర్ కామెడీలో పంథాలో `ముని`

శ్రీలంకలో భారీగా బాంబు పేలుళ్లు..166మంది మృతి

శ్రీలంకలో ఆదివారం ఉదయం వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 166 మంది మృతిచెందగా 400 మందికి పైగా గాయాలపాలయ్యారు.

ఇదో గుణ‌పాఠం కావాలి

ఢిల్లీ యాసిడ్ బాధితురాలు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ జీవితాధారంగా చేసుకుని ఓ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే

ఉపాస‌న‌కు దాదాసాహెబ్ ఫాల్కే

ముంబైలో శ‌నివారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది.