నారారోహిత్ కు హీరోయిన్ దొరికింది...

  • IndiaGlitz, [Tuesday,December 08 2015]

ఇమేజ్‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్న హీరో నారా రోహిత్ చేతి నిండా సినిమాల‌తో ఉన్నాడు. లిస్టు ప్ర‌కారం చూస్తే ఈ ఏడాది అర‌డ‌జ‌ను సినిమ‌ల్లో న‌టిస్తున్నాడు. నెమ్మ‌దిగా ఒక్కొక్క సినిమాను సెట్స్‌పైకి తీసుకెళుతున్నాడు. ఈ లిస్టులో సాయికొర్ర‌పాటి నిర్మాత‌గా ప్ర‌దీప్ అనే నూత‌న ద‌ర్శ‌క‌త్వంలో రాజా చెయ్యివేస్తే సినిమా చేయ‌బోతున్నాడు.

వ‌చ్చే నెల‌లో సినిమాను సెట్స్‌లోకి తీసుకెళ్ళ‌డానికి నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నారా రోహిత్ స‌ర‌స‌న హీరోయిన్ కోసం యూనిట్ వ‌ర్గాలు చాలా ప్ర‌య‌త్నాలే చేశారు. చివ‌ర‌కు నితిన్ స‌ర‌స‌న గుండె జారి గ‌ల్లంత‌య్యిందే చిత్రంలో న‌టించిన ఇషా త‌ల్వార్‌ను ఎంపిక చేశార‌ట‌. తెలుగు సినిమాల్లో న‌టించి ఇషాత‌ల్వార్‌కు చాలా గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు రాజా చెయ్యి వ‌స్తే ఎలాంటి బ్రేక్ తెస్తుందో చూద్దాం.

More News

'సోగ్గాడే చిన్ని నాయనా' ఆడియో రిలీజ్ డేట్....

నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా'.అన్నపూర్ణ స్డూడియో బ్యానర్పై నాగార్జున ఈ చిత్రంలో నటిస్తూ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

వరుణ్ తేజ్ వాళ్ళ బాబాయ్ కంటే పెద్ద హీరో అవుతాడు - ప్రభాస్

'ముకుంద','కంచె'వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో

'సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు' టీజర్ విడుదల

ఉయ్యాల జంపాలా,సినిమా చూపిస్త మామ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్‘కుమారి 21ఎఫ్’చిత్రంతో హ్యాట్రిక్ను సాధించి క్రేజీస్టార్గా మారాడు.

వెంకీ న్యూ మూవీ టైటిల్

విక్టరీ వెంకటేష్..యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

'బాహుబలి 3' స్టార్టయిందట....

తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్ రేంజ్ కు తీసుకెళ్ళిన సినిమా ‘బాహుబలి’. రెండు పార్టులున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ బాహుబలి బిగినింగ్ విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 చిత్రీకరణను రంగం సిద్ధమవుతుంది.