close
Choose your channels

'సోగ్గాడే చిన్ని నాయనా' ఆడియో రిలీజ్ డేట్....

Tuesday, December 8, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగార్జున ద్విపాత్రాభిన‌యం చేస్తున్న సినిమా సోగ్గాడే చిన్నినాయ‌నా`. అన్న‌పూర్ణ స్డూడియో బ్యాన‌ర్‌పై నాగార్జున ఈ చిత్రంలో న‌టిస్తూ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్ తండ్రికొడుకులుగా న‌టిస్తున్నాడు. అవుటండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుంతోన్న ఈ చిత్రంలో తండ్రి నాగార్జున ఆత్మ రూపంలో ఉండి త‌న‌దైన కామెడిని క్రియేట్ చేస్తాడ‌ట‌. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం సినిమా ఆడియో విడుద‌లను డిసెంబ‌ర్ 27న గ్రాండ్ లెవ‌ల్లో చేయ‌డానికి నాగ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.