కొత్త ప‌లుకులు ప‌ల‌క‌నున్న ముద్దుగుమ్ములు

  • IndiaGlitz, [Tuesday,May 12 2020]

ఒక‌ప్పుడు తెలుగు సినిమాలంటే తెలుగు హీరోయిన్స్ మాత్ర‌మే న‌టించేవారు. కానీ ఓ ద‌శ‌కంలో ఉత్త‌రాదిన భామ‌లు, ఇత‌ర ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లు(తమిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌)కు చెందిన ముద్దుగుమ్మ‌లు న‌టించారు. అయితే వీరంద‌రూ ఇత‌రుల‌తో డ‌బ్బింగ్ చెప్పించుకుని త‌న కెరీర్‌ను సాగించారు. కానీ ఇప్పుడు ఇత‌ర భాష‌ల‌కు చెందిన హీరోయిన్స్ మాత్రం అలా ఉండ‌టం లేదు. వారు త‌మ ఐడెంటిటీని నిరూపించుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఏ భాష‌లో న‌టిస్తే ఆ భాష‌ను నేర్చుకోవ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నారు.

ఇలా కొత్త భాష‌ల్లో కొత్త ప‌లుకులు నేర్చుకోవాల‌నుకుంటున్న హీరోయిన్స్‌కు లాక్‌డౌన్ వ‌ల్ల దొరికిన ఖాళీ స‌మ‌యం బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ట‌. త‌మ‌న్నా గుజరాతీ అమ్మాయి అయిన‌ప్ప‌టికీ హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల‌ను నేర్చుకుంది. ఇది ఆమెను మ‌న ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేలా చేసింది. ఇప్పుడు ఈమె బాట‌లోనే మ‌రో హీరోయిన్ కొత్త భాష నేర్చుకోవ‌డానికి ఆస‌క్తిని చూపుతుంద‌ట‌. ఆమె ఎవ‌రో కాదు.. నిధి అగ‌ర్వాల్‌. తెలుగులో హీరోయిన్‌గా న‌టిస్తున్న నిధి అగ‌ర్వాల్ ఇప్పుడు త‌మిళంలోకి అడుగు పెట్టింది. తెలుగును ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న నిధి అగ‌ర్వాల్ ఇప్పుడు త‌మిళాన్ని నేర్చుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ప‌దాల‌ను రాసుకుని వాటిని త‌మిళంలో ఎలా ప‌ల‌కాలో నేర్చ‌కుంటున్నాన‌ని నిధి అగ‌ర్వాల్ చెప్పారు.

More News

తెలుగు ఛానెల్‌పై కేసు వేస్తామంటోన్న కేజీయ‌ఫ్ నిర్మాత‌లు

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1’. ఈ సినిమా రెండో పార్టుగా ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ సెట్స్‌పై ఉంది.

మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్‌తో చిరు సంభాష‌ణ‌

వ‌ర‌ల్డ్ మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రపంచంలోని అమ్మ‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌చేసిన సంగ‌తి తెలిసిందే. అదే రోజున ఓ మ‌హిళా ఆఫీస‌ర్ మ‌రో మ‌హిళ‌కు

సడలింపులే కొంపముంచాయా.. లాక్ డౌన్ 4.0 పక్కానా!?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా చాలా బెటర్. ఇందుకు కారణం లాక్ డౌన్.. ఇది ఎవరు ఒప్పుకున్నా..

జగన్ నిర్ణయంపై కేసీఆర్ అభ్యంతరం.. న్యాయపోరాటం!

టైటిల్ చూడగానే ఇదేంటి.. నిన్న మొన్నటి వరకూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి సఖ్యతగా ఉన్నారు కదా..? సడన్‌గా ఏమైంది..? అసలేం జరిగింది..?

క్షమించండి.. రాజకీయాలొద్దు.. సినిమాలే ముద్దు!

అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన తప్పును తెలుసుకుని తన అభిమానులు, సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పాడు.