close
Choose your channels

సడలింపులే కొంపముంచాయా.. లాక్ డౌన్ 4.0 పక్కానా!?

Tuesday, May 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సడలింపులే కొంపముంచాయా.. లాక్ డౌన్ 4.0 పక్కానా!?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా చాలా బెటర్. ఇందుకు కారణం లాక్ డౌన్.. ఇది ఎవరు ఒప్పుకున్నా.. నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం. అయితే మూడోసారి లాక్ డౌన్ విధించినప్పుడు కేంద్రం కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. దీంతో అప్పటి వరకూ కాస్తో కూస్తో కరోనా కేసులు దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయాయ్. అప్పటి వరకూ వందల్లో ఉండే కేసులు వేలకు పెరిగిపోయాయ్. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో అయితే రోజుకు ఆరేడు వందలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇందుకు కారణం సడలింపులే.. ఇందులో ముఖ్యంగా మద్యం అమ్మకాలే అని కొందరు విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు.

సీన్ మొత్తం రివర్స్..!?
లాక్ డౌన్‌తో కేసులు తగ్గుతాయోమో..? అని ఎక్కడో చిన్న ఆశ ఉండేది అయితే 3.0 ముగిసే సరికి వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం భారతీయులను కలవరపాటుకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా గత 24 గంటల్లో 2487 కొత్త కేసులు నమోదవడం ఇండియాలో భయానక పరిస్థితిని చాటుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నంబరింగ్ చూస్తుంటే యూరప్ దేశాల్లో పరిస్థితి గుర్తుకొస్తోంది. ఇవాళ నమోదైన కేసులతో ఇండియాలో కేసుల సంఖ్య 40 వేలు దాటేయడం గమనార్హం. అంతేకాదు.. మరోవైపు మరణాలు కూడా ఒకే ఒక్కరోజులో 83 కావడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఓ వైపు రోజురోజుకూ కేసుల తీవ్రత పెరగడం.. మరోవైపు మరణాలు పెరగడం.. ఇంకోవైపు అనుమానితుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుండటంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కేసుల్లో ఎక్కడో ఉండే ఇండియా.. రోజురోజుకూ దేశాలు దాటిపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 12వ స్థానంలో ఉండటం గమనార్హం. మొత్తానికి చూస్తే లాక్ ‌డౌన్ విధిస్తే పరిస్థితులు అనుకూలిస్తాయ్.. కేసులు తగ్గుతాయ్ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నాయ్ కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. అది కూడా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పుడు కావడం గమనార్హం.

పక్కాగా 4.0?

మొదటి ఒకట్రెండు లాక్‌డౌన్‌లో కాస్త కేసులు అదుపులోనే ఉన్నాయ్.. అందుకే 3.0 విధిస్తే కచ్చితంగా కంట్రోల్ అవుతుందని కేంద్రం భావించింది. అయితే సడలింపులు ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇదే కొంపముంచిందని కూడా నిపుణులు చెబుతున్నారు. అందుకే 4.0 లాక్ డౌన్ విధించి ఈసారి సర్వం బంద్ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలియవచ్చింది. సోమవారం నాడు జరిగిన సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎక్కువ మంది ముఖ్యమంత్రులు పొడిగించాల్సిందేనని చెప్పినట్లు తెలియవచ్చింది. అయితే కొందరు ఈ నెల చివరికి అని చెప్పగా మరికొందరేమో జూన్ రెండో వారం వరకూ లాక్ డౌన్ విధించాల్సిందేనని ప్రధానిని పట్టుబట్టారట.

వీటి పరిస్థితేంటో..?

మే-12 నుంచి దేశ వ్యాప్తంగా కొన్ని రైళ్లు నడవనున్నాయ్.. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ కూడా అయ్యాయ్. మరోవైపు త్వరలోనే బస్సులు కూడా తిరుగుతాయని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చాడు. మరోవైపు విమానాలు ఇప్పటికే కొన్ని తిరుగుతున్నాయ్. లాక్ డౌన్ 4.0 తప్పదు అనుకున్న టైమ్‌లో వీటి పరిస్థితేంటి..? అనేది ప్రశ్నార్థకంగానే మారింది. ఇంకోవైపు ఇంకా పూర్తిగా వలసకార్మీకులను వారి స్వరాష్ట్రాలకు పంపేందుకు చర్యలూ కొనసాగుతున్నాయ్. ఇలాంటి తరుణంలో 4.0 లాక్ డౌన్ విధిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయ్ అని కేంద్రం నిపుణుల కమిటీతో నిశితంగా చర్చించి ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించి పొడిగింపుపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలియవచ్చింది. మరి ఆ ప్రకటన ఎప్పుడు వస్తుందో..? ఏమని వస్తుందో..? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.