డైరెక్ట‌ర్‌కు భూ కేటాయింపులు.. స‌ర్కార్‌కు కోర్టు నోటీసులు

  • IndiaGlitz, [Tuesday,May 05 2020]

తెలంగాణ ప్ర‌భుత్వం సినీ రంగ అభివృద్ధికి చాలా ప్రాముఖ్య‌త ఇస్తుంది. చాలా సంద‌ర్భాల్లో ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం బ‌హిరంగంగానే ప్ర‌క‌టించింది కూడా. తెలంగాణ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం సినీ స్టూడియో క‌ట్ట‌డానికి ఓ ప్రాంతంలో కొంత భూమిని కేటాయించారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం స‌ర్కారుకి కొత్త స‌మ‌స్య‌ను తెచ్చిపెట్టింది. తెలంగాణ ప్ర‌భుత్వం డైరెక్ట‌ర్ ఎన్‌.శంక‌ర్‌కు ఆయాచితంగా భూ కేటాయింపులు చేశార‌ని తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. భూమి ఎంతో ఖ‌రీదైన ప్రాంతంలో త‌క్కువ ధ‌ర‌కే భూమిని స‌ద‌రు డైరెక్ట‌ర్‌కి కేటాయించారంటూ స‌ద‌రు పిటిష‌న‌ర్ కోర్టులో కేసు వేశారు.

పిటిష‌న్‌ను స్వీక‌రించిన కోర్టు తెలంగాణ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇలాంటి పిటిష‌న్స్ మ‌రికొన్ని కూడా ఉన్నాయని వాట‌న్నింటినీ క‌లిపి హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించాల‌నుకుంటుంద‌ని టాక్‌. ముందుగా కోర్టు మున్సిప‌ల్ శాఖ‌కు నోటీసులు జారీ చేసింద‌ట‌. మ‌రి కోర్టుకు మున్సిప‌ల్ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం కూడా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వార్త‌ల్లో నిజా నిజాలేంటో తెలియాలంటే డైరెక్ట‌ర్ ఎన్‌.శంక‌ర్ స్పందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

More News

ప్ర‌భాస్ 20లో ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో పూజా హెగ్డే

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది.

మ‌రోసారి ఆమెతోనే జోడీ క‌డుతున్న నితిన్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్ చాలా గ్యాప్ తీసుకుని భీష్మ సినిమా చేశాడు. ఈ సినిమా ఈ ఏడాది విడుద‌లై మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు.

ఏపీలో మందుబాబులకు మరో భారీ షాక్.. పెరిగిన ధరలు ఇవీ...

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో 3.0 లాక్‌డౌన్‌లో భాగంగా మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.

టాలీవుడ్‌కు త్వరలో మంచి రోజులొస్తాయ్.. : మంత్రి తలసాని

టాలీవుడ్ ఇండస్ట్రీకి త్వరలోనే మంచి రోజులొస్తాయని సినిమాటోగ్రాఫర్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. మంగళవారం నాడు నగరంలోని ఫిల్మ్ ఛాంబర్ మీడియా మీట్ నిర్వహించిన

దుర్గమ్మ సాక్షిగా గుడి ప్రాంగణంలో అపచారం..

కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గమ్మకు చెంతకు ప్రతి రోజూ వేలాది మంది వెళ్లి దర్శించుకుంటూ ఉంటారు. అమ్మను ఏ కోరిక కోరినా తప్పుకుండా నెరవేస్తారనే భక్తుల ప్రగాఢ నమ్మకం.