సైరా కోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌...

  • IndiaGlitz, [Tuesday,June 12 2018]

బాక్సాఫీస్‌కు కొత్త లెక్క‌లు నేర్పించిన క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి. 10 ఏళ్ళ విరామం త‌రువాత 'ఖైదీ నంబ‌ర్ 150'తో ప‌ల‌క‌రించినా.. రికార్డు స్థాయి వ‌సూళ్ళ‌ను త‌న సొంతం చేసుకున్నారాయ‌న‌.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం చిరు త‌న 151వ చిత్రంగా 'సైరా నరసింహారెడ్డి' చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.నయనతార, తమన్నా కథానాయికలు. అమితాబ్‌బచ్చన్‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కోకాపేట‌లో వేసిన భారీ సెట్‌లో ఏక‌ధాటిగా 40 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించే యాక్ష‌న్ ఏపిసోడ్స్‌ను ఫ్యాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్‌, స్కై ఫాల్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ చేసిన గ్రెగ్ పావెల్ కంపోజ్ చేస్తున్నారట‌. 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో సినిమా విడుద‌ల కానుంది.

More News

'ల‌వ‌ర్' కోసం బాలీవుడ్ టెక్నీషియ‌న్

'ఉయ్యాలా జంపాలా', 'కుమారి 21ఎఫ్', 'సినిమా చూపిస్త మావ' వంటి సినిమాలతో కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్.

నా లవ్ స్టోరీ ఆడియో విడుదల

అందమైన ప్రేమకథ గా మలిచిన 'నా లవ్ స్టోరీ' ఆడియో విడుదల ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర ప్రముఖుల చేతుల మీదుగా జరిగింది.

'ఈ మాయ పేరేమిటో' ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ విడుద‌ల చేసిన నాగ‌చైత‌న్య‌

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్.

గోపీచంద్ 'పంతం' షూటింగ్ పూర్తి.. జూలై 5న గ్రాండ్ రిలీజ్‌

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా కె.చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుడితో సూర్య‌

అనువాద చిత్రాల‌తోనే తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైన త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌. గ‌జిని, సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్‌, వీడొక్క‌డే, య‌ముడు, సింగం, 24 చిత్రాలు సూర్య‌కి ప్ర‌త్యేక గుర్తింపు తీసుకువ‌చ్చాయి.