భారీ ధర పలికిన 'బీబీ 3' ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పక హ్యాట్రిక్ కొడుతుందని అభిమానులు భావిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా రూ.రూ.30 లక్షల వ్యయంతో భారీగా ఓ దేవాలయం సెట్‌ను వేశారు. ఈ సెట్‌లోనే నాలుగు రోజులుగా బోయపాటి కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మరో 12 రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుంది.

ఈ నెల 22తో అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకుని... ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం ఏప్రిల్‌లో అవుట్‌డోర్‌ షూటింగ్‌ కోసం బెల్గాం వెళ్లనుందని సమాచారం. అయితే ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర రైట్స్ ఇప్పటికే రూ.35 కోట్లు పలకగా.. నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ ను 16 కోట్లకు దిల్ రాజు దక్కించుకున్నాడని చెప్తున్నారు. కాగా. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం. ఓవర్సీస్‌లో ‘బీబీ 3’ థియేట్రికల్ రైట్స్ రూ.2 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం.

అయితే అన్ని సినిమాల్లో మాదిరిగా ఈ సినిమాలో రెగ్యులర్‌ డ్యూయెట్స్‌ ఉండవని సమాచారం. ఇప్పటికి రెండు పాటలు పూర్తయ్యాయనీ, మరో పాట చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ ప్రతి నాయిక పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయిందని టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

More News

గౌతమ్, నేనూ ఎప్పుడూ డేటింగ్ చేయలేదు: కాజల్

పెళ్లి తర్వాత మరింత జోరు పెంచేసింది కాజల్. గతంలోలా చిన్న హీరోలు, పెద్ద హీరోలు అన్న తేడా లేకుండా అందరితో చేసుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం మంచు విష్ణుతో కలిసి ఆమె నటించిన 'మోసగాళ్ళు’'

మోహన్‌బాబు, రానాల మధ్య ఫన్నీ కాన్వర్సేషన్.. బయటపడ్డ అసలు నిజం

కొన్ని మూవీ ఈవెంట్స్ అనుకోకుండా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అలా బయటకు వచ్చిందే ‘ఆచార్య’ టైటిల్. మెగాస్టార్ చిరంజీవి ఓ ఈవెంట్‌కు హాజరై అనుకోకుండా

హైదరాబాద్‌లో ఒకే స్కూలులోని 38 మంది విద్యార్థినులకు కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా పాఠశాలల్లో ఈ మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తోంది. కరోనా సమయంలో పాఠశాలలు తెరవడం.

కరోనాతో షూటింగ్‌కు బిగ్‌బాస్ బ్యూటీ.. కేసు నమోదు

కరోనా వైరస్ వచ్చి ఏడాది గడిచినా దాని ప్రభావం మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ విపరీతంగా నష్టపోయింది.

బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు షాక్.. కోర్టు జరిమానా

బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఊహించని విధంగా జరిమానా విధించింది. ఇంటర్నెట్ హ్యాండిలింగ్ చార్జీల పేరుతో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు