close
Choose your channels

గౌతమ్, నేనూ ఎప్పుడూ డేటింగ్ చేయలేదు: కాజల్

Wednesday, March 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గౌతమ్, నేనూ ఎప్పుడూ డేటింగ్ చేయలేదు: కాజల్

పెళ్లి తర్వాత మరింత జోరు పెంచేసింది కాజల్. గతంలోలా చిన్న హీరోలు, పెద్ద హీరోలు అన్న తేడా లేకుండా అందరితో చేసుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం మంచు విష్ణుతో కలిసి ఆమె నటించిన ‘మోసగాళ్ళు’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కాజల్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించింది. పర్సనల్, సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను కాజల్ పంచుకుంది.

నాది పెద్ద మాస్టర్ మైండ్..

ఈ సినిమా నాకొక కొత్త ఎక్స్‌పీరియన్స్. న్యూ జోనర్. కాబట్టి దీనిని నేను ఛాలెంజింగ్‌గా తీసుకున్నా. నా రెగ్యులర్, కమర్షియల్ రోల్స్‌కి భిన్నంగా ఉంటుంది. ఈ స్టోరీ విన్నప్పుడే నాకు చాలా బాగా నచ్చింది. ముంబైలోని ఒక స్లమ్ ఏరియాలో కూర్చొని అన్నాచెల్లెళ్లు కలిసి చేసే చాలా పెద్ద స్కామ్. కానీ వాళ్లు అమెరికాలో స్కామ్ చేస్తారు. అందుకే నాకు చాలా బాగా నచ్చింది. విష్ణుకి చెల్లి అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. జెఫ్రీ ఈ కథ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. అయితే మనం ఇద్దరం అక్కాతమ్ముళ్లుగా నటిస్తే ప్రేక్షకులు స్వీకరిస్తారా? అని విష్ణుని అడిగా.తను దర్శకుడిని విజన్‌ నమ్మి చేద్దామని చెప్పారు. అలా ‘మోసగాళ్లు’ ప్రయాణం మొదలైంది. నా కేరెక్టర్ మెయిన్ అనిపించింది. అను అనే పాత్రలో నటించా. సినిమాలో నాది పెద్ద మాస్టర్ మైండ్.

ఈ సినిమాలో అవేం లేవు..

ఈ సినిమాలో నాకు యాక్షన్ సన్నివేశాలేమీ లేవు. నా నెక్ట్స్ మూవీలో ఉన్నాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు మోహన్‌బాబుగారు వంటి పెద్ద యాక్టర్ కన్నీళ్లు పెట్టుకోవడం చాలా సంతృప్తిగా అనిపించింది. విష్ణు ఒక ప్రొడ్యూసర్‌లా కాకుండా ఒక నటుడిగా మాత్రమే ఆలోచించాడు. నాకు వ్యక్తిగతంగా సెన్సార్‌ అనే నియమం పెట్టుకున్నా. ఇకపై అందుకు తగ్గట్టే కథల్ని ఎంపిక చేసుకుంటా. అంతే కానీ..పెళ్లయ్యింది కదా అని ప్రత్యేక జాగ్రత్తలంటూ ఏమీ లేదు. నాకు ప్రేమకథలన్నా, పౌరాణిక గాథలన్నా ఇష్టం. నవ్వించడమూ ఇష్టమే కాబట్టి ఆ అవకాశం ఏ సినిమా ఇచ్చినా కాదనకుండా చేస్తా. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ అయితేనే విలువ అని నమ్ముతా.

నేను మార్నింగ్ పర్సన్‌ని..

నేను సినిమాలు చేయడం వరకే ఆలోచిస్తాను. నా భర్త సినిమా వెనకాల విషయాల్ని గురించి ఆలోచిస్తుంటాడు. నా భర్తలో నచ్చని విషయమంటే.. నేను మార్నింగ్‌ పర్సన్‌ని. లేవగానే మూడు నిమిషాల్లో నా పనుల్లో నేను బిజీ అయిపోతుంటా. కానీ తను బెడ్‌ రూమ్‌ నుంచి బయటికి రావడానికి అరగంటకి పైగా సమయం పడుతుంది.

నేను హోస్ట్‌గా కూడా ఒక షో ఉండొచ్చు..

ఇక నా సినిమాల విషయానికి వస్తే.. ‘ఆచార్య’ చేస్తున్నా. నాగార్జునతో ఓ సినిమా ఒప్పుకొన్నా. తమిళంలో ‘ఘోస్టీ’ అనే చిత్రం చేస్తున్నా. ‘ఇండియన్‌2’ ప్రస్తుతానికి ఆగిపోయింది. నేను హోస్ట్‌గా ఓ షో కూడా ఉండొచ్చు.

మా స్టోరీ పెద్ద సినిమా కథ అవుతుంది..

మార్పులంటే పెద్దగా ఏమీ లేవు. ఎప్పట్లాగే సినిమాలతో బిజీగా గడుపుతున్నా. అయితే వైవాహిక జీవితం ఓ కొత్త అనుభూతినిస్తోంది. మహిళలు ఇంటిని చక్కబెట్టుకుంటూనే, ఉద్యోగాలు, ఇతరత్రా పనులు చేయడం ఎంత పెద్ద విషయమో బాగా అర్థమవుతోంది. పెళ్లి తర్వాత మా అమ్మపై మరింత గౌరవం పెరిగింది. నేనూ నా ఇంటిని నడపడంపై దృష్టిపెట్టా. గౌతమ్‌తో నా పరిచయం తదితర విషయాలను చూస్తే అదొక సినిమా స్టోరీ అవుతుంది. నిజానికి గౌతమ్‌, నేను మంచి స్నేహితులం. పదేళ్లుగా ఒకరికొకరు తెలుసు. మేం ఎప్పుడూ డేటింగ్‌ చేయలేదు. లాక్‌డౌన్‌లోనే మా స్నేహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలనుకున్నాం. ఇలాంటి సందర్భంలో ఎవరు నీతో ఉంటే బాగుంటుందనే ప్రశ్న వేసుకున్నప్పుడు మేం ఒకరికొకరు కనిపించాం. అప్పుడే మేం కలిసి జీవించాలనే నిర్ణయానికొచ్చాం. వెంటనే గౌతమ్‌ మా నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడారు. గౌతమ్‌ అడగ్గానే మా నాన్న ఒప్పుకొన్నారు. మా పెళ్లి తర్వాత మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఒక రకంగా మాది లాక్‌డౌన్‌ పెళ్లి అన్నమాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.