పల్లెబాట పట్టిన నగరవాసులు.. రద్దీగా హైదరాబాద్-విజయవాడ హైవే..

  • IndiaGlitz, [Friday,January 12 2024]

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగ 'సంక్రాంతి'. సంక్రాంతి వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే పల్లెలు, పట్టణాలు పండుగకు సిద్ధమవుతూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామాల్లో అయితే పండుగ వాతావరణం వేరే లెవల్లో ఉంటుంది. ఇళ్ల రకరకాల ముగ్గులు, పిండి వంటలతో పండుగ శోభ సంతరించుకుంటోంది. దీంతో ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా పండుగకు సొంతూళ్లకు వెళ్తూ ఉంటారు. ఈసారి కూడా ఉపాధి కోసం నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రజలు ఈ ఐదు రోజులు సొంతూళ్లలో బంధువుల మధ్య పండుగను జరుపుకునేందుకు పల్లె బాట పట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. దాంతో చౌటుప్పల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పలు కూడళ్లు వద్ద ట్రాఫిక్ భారీగా నిలిచిపోతుంది.

పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు క్యూ కట్టాయి. దీంతో టోల్ సిబ్బందితో పాటు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దండు మైలారం, దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, గుండ్లబావి క్రాసింగ్స్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. అలాగే కొర్లపహాడ్, మాడ్గులపల్లి వద్ద అదనపు టోల్ బూత్స్ ఏర్పాటు చేయడంతో కొంతమేర ట్రాఫిక్ తగ్గింది. మరో రెండు రోజుల పాటు రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు సొంత వాహనాలు లేని వాళ్లు.. బస్సులు, రైళ్లలో సొంతూళ్లకు చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్లు వేసినా జనాలకు సరిపోవడం లేదు. జనరల్ బోగీలు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC), టీఎస్ఆర్టీసీ(TSRTC) కూడా ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి. తెలంగాణ నుంచి 4,484 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌, ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు.

అటు ఏపీఎస్ఆర్టీసీ సైతం హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి కోసం 6,725 బస్సులను నడుపుతోంది. వీటితో పాటు హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, కర్నూ­లు, అనంతపురం, తిరుపతి, నెల్లూ­రు, ఒంగోలు, చీరాల, విశాఖపట్నంకు అదనంగా 1000 బస్సు సర్వీసులు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే బెంగళూరు, చెన్నై నగరాల నుంచి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు కూడా ప్రత్యేక బస్సు­లు నడిపేలా చర్యలు తీసుకున్నారు.

More News

Hanuman Vs Adipurush: 'హనుమాన్' వర్సెస్ 'ఆదిపురుష్'.. ప్రశాంత్‌ వర్మ దెబ్బకు ఓం రౌత్ అబ్బా..

టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తేజ సజ్జా హీరోగా ఆయన తెరకెక్కించిన 'హనుమాన్'(HanuMan) చిత్రం

వైసీపీ మూడో జాబితాలో రాయలసీమలోనే కీలక మార్పులు.. మంత్రులకు స్థానచలనం..

ఇప్పటికే రెండు జాబితాల్లో అభ్యర్థులకు ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 6 మంది ఎంపీలతో పాటు

BRS Party: మళ్లీ టీఆర్ఎస్‌గా మారనున్న బీఆర్ఎస్.. పార్టీ ఉనికి కోసమేనా..?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గ కారణాలపై అన్వేషిస్తోంది. దీంతో త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆ తప్పిదాలు జరగకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది.

YSRCP MPs: వైసీపీ ఎంపీ అభ్యర్థులుగా సినీ ప్రముఖులు.. ఎవరంటే..?

వైసీపీలో మూడో జాబితా ఇంఛార్జ్‌ల మార్పుపై సీఎం జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. మార్పులు చేర్పులు చేయాలనుకున్న నియోజవకర్గాల నేతలను క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని చర్చిస్తున్నారు.

YS Sharmila: షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వొద్దు.. మాజీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు..

వైయస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్, షర్మిల ఇద్దరు ఒక్కటేని..