ఇక‌పై న‌టించ‌ను: ఛార్మి

  • IndiaGlitz, [Monday,May 18 2020]

హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఛార్మి అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ న‌టించింది. అయితే క్ర‌మంగా నిర్మాత‌గా మారారు. పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి ఈమె సినిమాలు నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నింటీలో ఇస్మార్ట్ శంక‌ర్ భారీ హిట్‌ను సాధించింది. ఈ చిత్రం డెబ్బై కోట్ల రూపాయ‌ల మేర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఇప్పుడు పూరి ఏకంగా క‌ర‌ణ్ జోహార్‌తో క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

నిర్మాత‌గా మారిన ఛార్మి తాను ఇక‌పై సినిమాల్లో న‌టించ‌న‌ని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. ‘‘ఇక‌పై సినిమాల్లో రెండు వంద‌ల శాతం న‌టించ‌ను. కొత్త హీరోయిన్స్ వ‌స్తున్నారు. చ‌క్క‌గా పెర్ఫామెన్స్ చేస్తున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో నేను న‌టిగా చేయాల‌ని ప‌ట్టుకుని వేలాడాల‌ని అనుకోవ‌డం లేదు. నిజానికి జ్యోతిల‌క్ష్మీ స‌మయంలో రిటెర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని అనుకున్నాను. కానీ పూరిగారు, సి.క‌ల్యాణ్‌గారు వ‌ద్ద‌ని వారించారు. సినిమాల్లో న‌టించ‌వ‌ద్దు కానీ.. రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌వ‌ద్దు అని అన్నారు. ప్ర‌స్తుతం ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను చూడ‌టం ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు ఛార్మి.

More News

క్రేజీ కాంబినేష‌న్ మ‌రోసారి!!

మిర‌ప‌కాయ్‌తో సూప‌ర్‌డూప‌ర్ హిట్.. గ‌బ్బ‌ర్‌సింగ్‌తో ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌తో రామ్ ఆచంట‌

అదే మీరిచ్చే విలువైన బ‌హుమ‌తి..అభిమానులకు తార‌క్‌ రిక్వెస్ట్

తార‌క్ అభిమానులు ఆయ‌న పుట్టిన‌రోజున రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించిన వీడియో ప్రోమోను చూడటానికి ఆతృత‌గా ఎదురుచూడ‌సాగారు. అయితే రాజ‌మౌళి

కాలం, దేశం మారినా మేం మారలేదంటోన్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న పోస్ట్‌లు అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతున్నాయి.

తార‌క్ ఫ్యాన్స్‌కు షాక్‌...

మే 20న తార‌క్ పుట్టిన‌రోజు. ఈ రోజు కోసం తార‌క్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు కార‌ణం ‘రౌద్రం ర‌ణం రుధిరం (ఆర్ఆర్ఆర్‌)’. భారీ అంచనాల నడుమ తెరుకెక్కుతోన్న

డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు సూర్య కౌంట‌ర్‌!!

క‌రోనా ప్ర‌భావంతో ఇప్పుడు నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌స్థ‌లో గొడ‌వ‌లు త‌లెత్తాయి. ముఖ్యంగా హీరో సూర్య డిస్ట్రిబ్యూట‌ర్స్, థియేట‌ర్స్ ఓన‌ర్స్ నుండి ఓ రేంజ్ బెదిరింపుల‌నే ఎదుర్కొన్నారు.