మరో జన్ముంటే ‘జగన్‌’లా పుట్టాలని ఉంది!

  • IndiaGlitz, [Friday,May 10 2019]

డైరెక్టర్ వివి వినాయక్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. వినాయక్ తెరకెక్కించిన చాలా సినిమాల్లో దాదాపు హిట్సే.. యాక్షన్‌తో పాటు కామెడీ కూడా పండించే సినిమాను బ్లాక్‌బస్టర్‌కు చేరుస్తుంటారు. వినాయక్-పూరీ జగన్నాథ్ (పూరీ జగన్) ఇద్దరూ ఆప్తమిత్రులన్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూరీ గురించి మీ అభిప్రాయమేంటి..? ఆయనతో మీకున్న స్నేహం గురించి చెప్పండి అని వినాయక్‌ను అడగ్గా ఆసక్తికర విషయాలు మాట్లాడారు. అంతేకాదు రాజమౌళి గురించి ఆయన మాట్లాడారు.

రాజమౌళి గురించి..
రాజమౌళితో తాను చాలా స్నేహంగా ఉంటామన్నారు. రాజమౌళితో పాటు పూరీ జగన్నాథ్‌తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పుకొచ్చారు. రాజమౌళి, పూరీ, తాను ముగ్గురం మంచి స్నేహితులమన్నారు. తాను రాజమౌళి ఇంటికెళితే ఆయన, జక్కన్న కుటుంబ సభ్యులు చేసే హడావుడి అంతా ఇంత కాదని.. వాళ్లలోని ఆప్యాయత అంటే తనకు చాలా ఇష్టమన్నారు. అందరం కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటామని వినాయక్ చెప్పుకొచ్చారు.

జగన్ గురించి..
తాను ఎప్పుడైనా కాస్త ‘డల్’గా అనిపించినప్పుడు పూరిని కలవాలనిపిస్తుందని.. వినాయక్ చెప్పారు. డల్‌గా ఉన్నప్పుడు పూరీకి కాల్ చేసి.. ‘బిజీగా ఉన్నావా? పూరీ.. అని కాల్ చేస్తే.. ‘ముందు వచ్చేసేయ్’ అని తప్ప మారుమాట ఆయన నుంచి రాదని వినియాక్ చెప్పుకొచ్చారు. నిజంగా పూరీకి ఎలాంటి భయం.. టెన్షన్ లేకుండా చాలా బిందాస్‌గా ఉంటాడు. అంత స్వేచ్ఛగా వుండే ఆయనని చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంతేకాదు.. మళ్లీ వచ్చే జన్మంటూ ఉంటే పూరిలా పుట్టాలనిపిస్తుంది అని వినాయక్ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ మాటలు విన్న వినాయక్, పూరీ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ ఇంటర్వ్యూ చూసి వీడియోకు అభిమానులు, నెటిజన్లు చాలా హ్యాపీగా ఫీలవుతూ.. ‘ఎస్ మీరు చెబుతున్నది నిజమే వినాయక్ సార్..’ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ జక్కన్న, పూరీ చూస్తే ఎలా ఫీలవుతారో.. ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

విశాల్ చిత్రం వాయిదా

న‌టుడు, న‌డిగ‌ర్ సంఘం కార్య‌ద‌ర్శి, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు విశాల్ న‌టించిన చిత్రం 'అయోగ్య‌'. తెలుగులో విజ‌య‌వంత‌మైన `టెంప‌ర్`కు ఇది రీమేక్‌. రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది

మీడియా సర్కస్ వల్ల

బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ త‌న సినిమా 'సూప‌ర్ 30'కి సంబంధించి తన ట్విట్ట‌ర్ ద్వారా ప్రెస్‌నోట్‌ను విడుద‌ల చేశారు. "ఓ మీడియా వ‌ర్గం చేస్తున్న స‌ర్క‌స్ వ‌ల్ల నేను మాన‌సిక వేద‌న‌ను అనుభ‌విస్తున్నాను.

బిగ్‌బాస్‌3కి రెఢీ

లోక నాయకుడు క‌మ‌ల్‌హాస‌న్ లోక్‌స‌భ ఎన్నిక‌లు త‌ర్వాత సినిమాల‌తో, టీవీ ప్రోగ్రామ్‌ల‌తో బిజీగా మారిపోతున్నారు ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించాల్సిన `ఇండియ‌న్ 2`

హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌తో ర‌జ‌నీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇప్పుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో 'ద‌ర్బార్‌' సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ర‌జ‌నీకాంత్ త‌న‌కు హిట్ ఇచ్చిన యువ ద‌ర్శ‌కుడు కార్తీక్

శౌర్య‌తో మెహ‌రీన్‌

ఈ ఏడాది `ఎఫ్‌2` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంలో న‌టించి ఆక‌ట్టుకుంది మెహ‌రీన్ కౌర్‌. ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఈ ఏడాది రెండు సినిమాల‌కు సైన్ చేసింది.