ఐఐటీ కాన్పూర్ అధ్యయనం.. సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ విధ్వంసమే!

  • IndiaGlitz, [Monday,June 28 2021]

కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం నుంచి కొంత వరకు బయటపడగలిగాం. ఇప్పుడు థర్డ్ వేవ్ పై దేశ ప్రజల్లో ఆందోనళ నెలకొని ఉంది. వైద్య నిపుణులు కూడా థర్డ్ వేవ్ విషయంలో జాగ్రత్త అవసరం అని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా గురించి వస్తున్న అధ్యయనాలు మరింత కలవరపెట్టే విధంగా ఉన్నాయి.

తాజాగా ఐఐటి కాన్పూర్ థర్డ్ వేవ్ ప్రభావంపై ఓ చార్ట్ విడుదల చేసింది. థర్డ్ వేవ్ పై మూడు ప్రతిపాదనలు చేసింది. ఈ మూడు ప్రతిపాదనలతో ఏదో ఒక విధంగా థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందని తెలిపింది. సెకండ్ వేవ్ విషయంలో ఐఐటి కాన్పూర్ అంచనా 100 శాతం నిజం కావడంతో థర్డ్ వేవ్ అంచనాపై భయాందోళనలు మొదలయ్యాయి.

ఇంతకీ ఐఐటి కాన్పూర్ అంచనా ఏంటో చూద్దాం. ఒక వేళ జూలై 15న దేశం మొత్తం అన్ లాక్ ప్రారంభమై.. జన జీవితం నార్మల్ గా మారితే అనే కోణంలో ఐఐటి కాన్పూర్ ఈ ప్రతిపాదన చేసింది.

మొదటి అంచనా : చార్ట్ లోని గ్రీన్ డేటెడ్ లైన్స్ ప్రకారం జన జీవితం నార్మల్ గా మారితే థర్డ్ ప్రభావం అక్టోబర్ లో అత్యధిక స్థాయికి చేరుతుంది. అయితే ఇది సెకండ్ వేవ్ కంటే ప్రభావం తక్కువగానే ఉంటుంది.

రెండవ అంచనా : ప్రజా జీవనం నార్మల్ గా మారి వైరస్ పరివర్తన చెందితే సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. సెకండ్ వేవ్ ప్రభావం కంటే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది.

మూడవ అంచనా: లాక్ డౌన్, కఠినమైన కోవిడ్ నిబంధనలు విధిస్తే థర్డ్ వేవ్ ప్రభావం అక్టోబర్ లో ఉంటుంది. సెకండ్ వేవ్ తో పోల్చుకుంటే తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది.

అయితే ఈ అధ్యనంలో కోవిడ్ టీకా పంపిణి జరిగితే వైరస్ ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పలేదు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. కాబట్టి ఐఐటి కాన్పూర్ అంచనా 100 శాతం నిజం కాకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

More News

'మా' బరిలో ఊహించని వ్యక్తి.. విజయశాంతి సపోర్ట్!

త్వరలో జరగబోయే మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లో రోజుకొక పరిణామం చోటు చేసుకుంటోంది.

'స్టార్ మా' సంచలనం.. వందల కోట్ల బిజినెస్ చిత్రాలన్నీ..

తెలుగులో టాప్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో 'స్టార్ మా' ఒకటి.

సమంత అతడితో నటించిన రొమాంటిక్ సీన్లు డిలీట్!

ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై అఖండ విజయం సొంతం చేసుకుంది.

నాని 'జెర్సీ' చిత్రానికి ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ ఫిదా!

నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' చిత్రానికి ప్రశంసలు ఆగడం లేదు.

పిక్ టాక్: అక్కని మించేలా చెల్లి అందాల షో!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ డెబ్యూ మూవీ 'చిరుత' ఘనవిజయం సాధించింది.