close
Choose your channels

నాని 'జెర్సీ' చిత్రానికి ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ ఫిదా!

Sunday, June 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాని జెర్సీ చిత్రానికి ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ ఫిదా!

నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' చిత్రానికి ప్రశంసలు ఆగడం లేదు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ రైడ్ మూవీ ఆల్ టైం క్లాసిక్స్ లిస్ట్ లో చేరిపోయింది. ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయిపోయిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు.

క్రమంగా జెర్సీ చిత్ర ఖ్యాతి అంతర్జాతీయంగా వ్యాపిస్తోంది. ప్రముఖ ఆస్ట్రేలియన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ చ్లోయీ అమండా బైలీ 'జెర్సీ'చిత్రానికి ఫిదా అయింది. వెంటనే జెర్సీ చిత్రం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

'జెర్సీ మూవీ చూశాను. ఈ చిత్రం అద్భుతమైన ఎమోషనల్ జర్నీ. ఫిలిం మేకర్స్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అర్జున్ డ్రీమ్ వెనకాల నడించింది వారే. నాని నటన అద్భుతం. అతడితో కలసి నవ్వుతాం.. ఏడుస్తాం. ఈ చిత్రంలో ట్రైన్ సన్నివేశం నా ఫేవరేట్ సీన్' అని అమండా ట్వీట్ చేసింది.

లేటు వయసులో ఓ క్రికెటర్ అన్ని కష్టాలని ఎదుర్కొని తన డ్రీంని ఎలా చేరుకున్నాడు అనేదే ఈ చిత్ర కథ. నానికి జోడిగా ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ నటించింది. సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.