ఉగ్రమూకల పై భారత్ ఫస్ట్ రివెంజ్

  • IndiaGlitz, [Monday,February 18 2019]

పుల్వామా ఘటన అనంతరం ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ బలగాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఘటన జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల నుంచే ఉగ్రమూకలు ఈ వ్యవహారాలన్నీ నడిపుంటాయని భావించిన జవాన్లు.. సెర్చింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో నలుగురు ఉద్రవాదులు ఉన్నట్లు గుర్తించిన ఇండియన్ ఆర్మీ.. వారిపై దాడికి తెగబడింది. ఈ దాడిలో కమ్రాన్, ఘాజీ రషీద్ అనే ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా వీరిలో రషీద్.. ఇటీవల జరిగిన పుల్వామా ఘటనలో కీలక సూత్రధారి అని తెలుస్తోంది. సోమవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. మొత్తానికి చూస్తే ఉగ్రవాదులపై భారత్ ఫస్ట్ రివెంజ్ ఈ రూపంలో తీర్చుకుందన్న మాట.

మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రమూకలు!

పుల్వామా ఘటన అనంతరం పరిసర ప్రాంతాల్లోనే నక్కిన ఉగ్రమూకలు సోమవారం ఉదయం మరోసారి ఇండియన్‌‌ ఆర్మీని దొంగ దెబ్బ తీశాయి. పుల్వామాలోని పింగ్లాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు.. జైషే మహ్మద్ తీవ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ మేజర్‌‌తో పాటు ముగ్గురు జవాన్లు వీర మరణం చెందారు. ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ గుర్తించడంతో అలెర్టై కాల్పులు జరిపింది. ఇలా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక పౌరుడు కూడా కన్నుమూశాడు. మరోవైపు భద్రతా దళాలు పింగ్లాన్ ప్రాంతాన్ని అదుపులోకి జల్లెడ పడుతున్నాయి. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

More News

రాజీనామా చేసి వైసీపీలో చేరిన టీడీపీ ఎంపీ

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు వరుస షాక్‌‌లు తగులుతున్నాయి. ఒక్క రోజు గ్యాప్‌‌లోనే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీడుతుండటంతో అసలేం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.

వీర జవాన్ల కుటుంబాలకు 'మా' వంతు సాయం

పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు భారతదేశంలోని పలువురు ప్రముఖలు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు, పౌరులు, హీరోలు పెద్ద మనసుతో తమవంతుగా విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

హీరో గోపిచంద్‌‌కు రోడ్డు ప్రమాదం

హీరో గోపిచంద్ మరోసారి షూటింగ్‌‌లో గాయపడ్డారు. తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర్ నిర్మిస్తొన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ (రాజస్థాన్) దగ్గర మాండవలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

కేసీఆర్ కేబినెట్‌‌ నుంచి హరీశ్, కేటీఆర్, ఈటెల ఔట్!

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు పూర్తవుతున్నా ఇంత వరకూ కేబినెట్ ఏర్పాటు చేయాలేదే అపవాదును సీఎం కేసీఆర్ తుడుపుకుంటూ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎంపీ

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌‌లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు ‘బ్యాడ్ టైమ్’ స్టార్ట్ అయ్యిందని స్పష్టంగా అర్థమవుతోంది!.