close
Choose your channels

కేసీఆర్ కేబినెట్‌‌ నుంచి హరీశ్, కేటీఆర్, ఈటెల ఔట్!

Monday, February 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు పూర్తవుతున్నా ఇంత వరకూ కేబినెట్ ఏర్పాటు చేయాలేదే అపవాదును సీఎం కేసీఆర్ తుడుపుకుంటూ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 19న.. 8 నుంచి 10మంది ప్రజాప్రతినిధుల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. తొలుత 10మందితో.. పార్లమెంట్ ఎన్నికల అనంతరం మరోసారి కేబినెట్ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే కేబినెట్‌‌లో టీఆర్ఎస్‌‌కు పెద్ద తలకాయలు, రాజకీయ ఉద్ధండులైన కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కేసీఆర్‌‌కు కట్టప్పలాగా ఉండే హరీశ్‌ రావు, కేసీఆర్‌‌కు అత్యంత ఆప్తుడు ఈటెల రాజేందర్‌, గతంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత పద్మారావు‌కు ఈ సారి ఛాన్స్‌‌లేదని తెలుస్తోంది. అయితే ఎందుకు వీళ్లను కేసీఆర్ పక్కనపెట్టారో .. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయో ఎవరికీ అంతుచిక్కని పరిస్థితి నెలకొంది.

కేబినెట్ విస్తరణ‌‌పై గత కొన్ని రోజులుగా పలు టీవీ చానెల్స్, వార్తా పత్రికల్లో పుంకాలు పుంకాలుగా కథనాలు వస్తున్నాయి. అయితే తాజాగా.. టీఆర్ఎస్‌‌కు సంబంధించిన మీడియాలో విస్తరణపై పైవిధంగా వార్తలు రావడంతో ఆశావహులు ఒకింత అవాక్కయ్యారట. కాగా కేబినెట్‌‌లో ఫలానా వారిని తీసుకుంటున్నట్లు కూడా టీఆర్ఎస్ మీడియాలో వార్తలు రావడం గమనార్హం.

అదృష్టవంతులు వీరే...

ఇంద్రకరణ్‌రెడ్డి

కొప్పుల ఈశ్వర్

ఎర్రబెల్లి దయాకర్ రావు

జగదీష్‌రెడ్డి

ప్రశాంత్‌రెడ్డి

నిరంజన్‌రెడ్డి

శ్రీనివాస్‌గౌడ్‌

తలసాని శ్రీనివాస్ యాదవ్‌

నిరంజన్‌ రెడ్డి.

వీరితో పాటు ఒక మహిళకు, ఎస్సీ, ఎస్టీకు చెందిన ఒకరికి కేసీఆర్ అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పద్మాదేవేందర్ రెడ్డి లేదా రేఖా నాయక్‌‌కు కేబినెట్‌‌లో అవకాశం ఉంటుందని సమాచారం. మొత్తానికి చూస్తే పాతనీరును పక్కనబెట్టి.. కొత్తనీరును చూసుకోవాలని కేసీఆర్ భావిస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇప్పటికే పలు లీకులు రావడంతో అసలు ఏది నిజం..? ఏది అబద్ధం..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.