21 రోజుల పాటు ఇండియా లాక్‌డౌన్..: మోదీ

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ‘జనతా కర్ఫ్యూ’ ప్రకటించిన కేంద్రం.. తాజాగా మరో సంచలన నిర్ణయమే తీసుకుంది. ఇవాళ అనగా మంగళవారం అర్థరాత్రి నుంచి దేశం మొత్తాన్ని సంపూర్ణంగా మూసివేస్తున్నట్లు (లాక్‌డౌన్‌) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మూసివేత అనేది 21 రోజుల పాటు కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. అంటే ఏప్రిల్-14 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందన్న మాట.

నేటి రాత్రి నుంచి సర్వం బంద్

మంగళవారం సాయత్రం 08 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలుకు పలు కీలక సూచనలు, సలహాలు ఇవ్వడమే కాకుండా చేతులెత్తి నమస్కరిస్తూ పలు విజ్ఞప్తులు కూడా చేశారు. దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లవద్దని, ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే.. ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలోనే ఉండాలని.. ప్రజల సహకారం ఉంటేనే కరోనా విజయం సాధిస్తామని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ప్రతి ఇంటికీ ఇదే లక్ష్మణ రేఖ!

‘ఏం జరిగినా సరే ఇంటి నుంచి బయటికి రాకూడదు. ఈ అర్ధరాత్రి నుంచి మొత్తం లాక్ డౌన్ చేసేస్తున్నాం. ఇల్లు విడిచి బయటికి రావడం పూర్తిగా నిషేధం. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలి. ఒకరకంగా చెప్పాలంటే జనతా కర్ఫ్యూని మించి ఇది. ప్రతి ఒక్కర్నీ (భారత ప్రజలను) లాక్‌డౌన్ పాటించాలని వేడుకుంటున్నాను. ఈ 21 రోజులు ఇళ్ల నుంచి బయటికి రావొద్దు. ఈ 21 రోజులే చాలా కీలకం. 21 రోజులు ఇళ్లలో ఉండకపోతే.. పరిస్థితి చేయిదాటిపోతుంది. లాక్‌డౌన్ నిర్ణయం ప్రతి ఇంటికి లక్ష్మణ రేఖ’ అని మోదీ చెప్పుకొచ్చారు.

దయచేసి అర్థం చేస్కోండి..!

ఆయన అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తప్పనిసరై ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఏప్రిల్-14 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా సవాల్ విసురుతూనే ఉంది. కరోనా వ్యాప్తిని మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కరోనాను అరికట్టాలంటే.. సోషల్ డిస్టెన్సే ఏకైక మార్గం. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. నేను ఈ మాట భారత ప్రధానిగా చెప్పడం లేదు.. మీ ఇంటి సభ్యుడిగా చెబుతున్నాను. దయచేసి ఎవరూ నిబంధనలు ఉల్లంఘించొద్దు. ఒక వ్యక్తి ద్వారా వేల మందికి వైరస్ వ్యాపిస్తుంది. కరోనా నియంత్రణకు గాను రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నాం’ అని మోదీ కీలక ప్రసంగం చేశారు

More News

కరోనా ఎఫెక్ట్ : టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఒలింపిక్స్ క్రీడలపై కూడా పడింది. ఈ క్రమంలో జపాన్‌లోని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు వాయిదా వేయాలని నిర్ణయించడం జరిగింది.

చిరు 152లో రంగ‌మ్మ‌త్త‌ ?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య ఇప్పుడు సెట్స్‌లో ఉంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ ఆగింది. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో ఇప్ప‌టికే రెజీనా క‌సండ్ర ఓ స్పెష‌ల్

బాలీవుడ్ 'భీష్మ' ఎవ‌రంటే?

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 21న తెలుగులో విడుద‌లైన భీష్మ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించింది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కింది. ర‌ష్మిక మంద‌న్న

అదే రోజున ప్లాన్ చేసుకున్న మ‌హేశ్‌?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకి రంగం సిద్ధ‌మ‌వుతోంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, మ‌హేశ్‌కి క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది. వంశీ పైడిప‌ల్లి స్థానంలో

RRR: ఉగాది ట్రీట్‌గా టైటిల్

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా