'ఇండియ‌న్ 2' ప‌నుల్లో స్పీడు పెంచ‌మ‌న్న క‌మ‌ల్

  • IndiaGlitz, [Sunday,September 15 2019]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో 23 ఏళ్ల త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం 'ఇండియ‌న్ 2'. 1996లో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన 'ఇండియ‌న్‌'కు ఇది సీక్వెల్. ఈ సీక్వెల్‌లో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సిద్ధార్థ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే సిద్ధార్థ్‌, ర‌కుల్‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. అలాగే చెన్నై టీన‌గ‌ర్‌లోని ఓ భారీ హోట‌ల్‌కి క‌మ‌ల్ ఎంట్రీ ఇస్తున్న‌ట్లు కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ప్ర‌త్యేక‌మైన సెట్‌లో క‌మ‌ల్‌హాస‌న్‌కు, విల‌న్‌కు మ‌ధ్య ఫైట్‌ను చిత్రీక‌రించారు.

ఈ సినిమా ప‌నులు నెమ్మ‌దిగా సాగుతున్నాయ‌ని వార్త‌లు రావ‌డం.. త‌దిత‌ర కార‌ణాల‌తో రీసెంట్‌గా క‌మ‌ల్ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను క‌లిసి సినిమాను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయ‌మ‌ని కోరారట‌. దానికి వారు కూడా స‌రేన‌న్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా కోసం వ‌య‌సు మ‌ళ్లిన సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ మ‌రోసారి తెర‌పై క‌న‌ప‌డ‌నున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న న‌టిస్తుంటే.. సిద్ధార్థ్ జోడిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ సినిమా కోసం ప్ర‌త్యేక‌మైన మార్ష‌ల్ ఆర్ట్స్‌ను నేర్చుకుంటుంది. సీక్వెల్‌లో ఈమెపై కూడా కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తార‌ట‌. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న క‌మ‌ల్ హాస‌న్ మ‌రో ప‌క్క బిగ్‌బాస్ 3 త‌మిళ వెర్ష‌న్‌కు హోస్ట్‌గా కూడా వ‌ర్క్ చేస్తున్నారు.

More News

ద‌ర్శ‌కుడిగా మారుతున్న స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్

ఓ స‌న్నివేశాన్ని ఎలా చేయాలి, ఎలా తీయాల‌నేది ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌, ఉహ అయితే.. ఆయ‌న ఆలోచ‌న‌కు అనుగుణంగా ఆ స‌న్నివేశాన్ని ర‌క్తి కట్టించేది మాత్రం సినిమాటోగ్రాఫ‌ర్‌.

ఆ హీరోయిన్ మ‌రోసారి విల‌న్‌గా..!

ఇప్పుడు సినిమా హీరో, హీరోయిన్స్ ట్రెండ్ మారుస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను చేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు.

న‌ల్ల‌మల‌పై స్పందించిన కేటీఆర్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ రిప్లై

యురేనియం కోసం న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో త‌వ్వ‌కాలు జ‌ర‌పాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది.

ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన మహేశ్!

అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మైగ్రేన్ తలనొప్పితో బాధపడ్డారు.

దూరం.. దూరం.. జగన్‌లాగే ‘డీకే’ కొత్త పార్టీ!?

కర్ణాటక నాట మరో కొత్త పార్టీ పుడుతోందా..? ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన డీకే శివకుమార్ కొత్త పార్టీ పెట్టబోతున్నారా..?