ప్రయాణికులకు చుక్కలు చూపిన ఇండిగో విమానం!

  • IndiaGlitz, [Sunday,April 21 2019]

ఇండిగో విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం వైజాగ్‌కు బయల్దేరిన విమానం ల్యాండింగ్ కాలేదు. గత రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వాతావరణం అనుకూలించక విమాన ప్రయాణికులు ఒకచోట నుంచి మరో చోటికి వెళ్లాలంటే తీవ్ర ఇక్కట్లు తప్పట్లేదు. వివరాల్లోకెళితే.. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రయాణికులతో ఇండిగో విమానం వైజాగ్‌కు బయల్దేరింది. అయితే ఉరుములు, మెరుపుల మధ్యనే వైజాగ్‌కు విమానం వెళ్లినప్పటికీ అక్కడ ల్యాండింగ్‌ చేయడానికి వీలు కాలేదు. ఒకటికి రెండు సార్లు ల్యాండింగ్ చేయడానికి ఫైలెట్ ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. ఈ కుదుపులతో ప్రయాణికులు అరుపులు కేకలతో హోరెత్తించారు. దీంతో మళ్లీ వైజాగ్ నుంచి హైదరాబాద్‌‌కు విమానం తిరుగుపయనమైంది.

ఇదిలా ఉంటే.. అనుకున్న సమయానికి ఇంటికి రాకపోవడంతో ప్రయాణికుల కుటుంబ సభ్యులు అసలేం జరిగిందా..? ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భారీ వర్షంతో ఫోన్లు కూడా కలవకపోవడంతో మరికొందరు ప్రయాణికులు ఇంటికి సమాచారం కూడా చేరవేయలేకపోయారు. విమానంలోని ప్రయాణికులంతా గగ్గోలు పెడుతుండటంతో వారికి నచ్చజెప్పి.. అందరికీ స్నాక్స్ ఇచ్చింది సిబ్బంది. దీంతో ప్రయాణికులు కాసేపు సేదతీరారు. అయితే వాతావరణం అనుకూలిస్తే అరగంటలో హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు వెళ్తామని సిబ్బంది ప్రయాణికులకు చెప్పింది. సింగిల్ టికెట్‌తో హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు.. మళ్లీ వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చామని కొందరు హాయిగా ఎంజాయ్ చేయగా.. మరికొందరు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఇంకా విమానం హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు కదిలిందా..? లేదా..? అనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More News

భాగ్యనగరాన్ని మరోసారి ఉగ్రవాదులు టార్గెట్ చేశారా..!?

హైదరాబాద్‌ను మరోసారి ఉగ్రవాదులు టార్గెట్ చేశారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది.

పాక్‌‌కు మరో సడన్ షాకిచ్చిన భారత్...

పుల్వామా ఘటన అనంతరం దాయాది దేశమైన పాక్‌కు భారత్ వరుస షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే 'అత్యంత అభిమాన దేశం' (మోస్ట్ ఫేవర్డ్ నేషన్) హోదాను ఇండియా రద్దు చేస్తూ షాక్

 'జెర్సీ' స‌క్సెస్‌ను ఇంత పెద్ద రేంజ్‌లో ఊహించ‌లేదు - ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి

నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా, రోనిత్ క‌మ్ర‌, స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో  సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి జనసేన రె'ఢీ'

తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన రె‘ఢీ’ అయ్యింది. ఈ మేరకు జనసేన తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా ఈ పోటీ విషయాన్ని స్పష్టం చేసింది.

ముంబైలో ప్ర‌భాస్ 'సాహో'

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కి క్రేజ్ 'బాహుబ‌లి'తో అమాంతం పెరిగింది. ఇప్పుడు ప్ర‌భాస్ సినిమాల గురించి ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.