'ఇంద్రసేన' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Saturday,November 25 2017]

వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంటోని తాజాగా నటించిన చిత్రం 'ఇంద్రసేన'. ఆర్.స్డూడియోస్, విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై జి.శ్రీనివాసన్ దర్శ‌క‌త్వంలో రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని 'ఇంద్రసేన' చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

సీనిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ క్లియ‌ర్ కావ‌డంతో సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా ఏక కాలంలో న‌వంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.

డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగులో త‌నకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న విజ‌య్ ఆంటోనికి సినిమాల‌కు తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి ఆద‌ర‌ణ ఉంది. గ‌తంలో కూడా నకిలీ, డా.స‌లీంల‌తో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న విజ‌య్ ఆంటోని 'బిచ్చ‌గాడు'తో సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. త‌ర్వాత భేతాళుడు, యెమ‌న్ చిత్రాల‌తో క‌మ‌ర్షియ‌ల్ హీరోగా స‌క్సెస్ సాధించారు.

బిచ్చ‌గాడు చిత్రంలోని మ‌ద‌ర్ సెంటిమెంట్‌కు త‌న అద్భుత‌మైన న‌ట‌న‌ను తోడు చేసి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ వ‌ర్షాన్ని కురిపించిన విజ‌య్ ఆంటోని 'ఇంద్ర‌సేన' చిత్రంలో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో ఆక్టుకోవ‌డానికి సిద్ధ‌మైయ్యారు విజ‌య్ ఆంటోని. బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో పాటు హై ఎమోష‌న్స్ కాంబినేష‌న్స్‌తో రూపొందింది.

More News

చరణ్.. ఆ ఇద్దరితో మూడోసారి?

మెగాపవర్ స్టార్ రామ్చరణ్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం 1985తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని వేసవి కానుకగా మార్చి 29న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

అజ్ఞాతవాసిలోనూ ఆమె ఉందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది అత్తారింటికి దారేది. కుటుంబ కథా చిత్రంగా నిరూపొందినఈ సినిమా.. ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది.

చరణ్ మూడోసారి ఒప్పుకుంటాడా?

మెగాపవర్ స్టార్ రామ్చరణ్ తనతో మూడోసారి నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్కు అవకాశం ఇస్తాడా?..ఏమో చెప్పలేం అంటున్నారు టాలీవుడ్ జనాలు. వివరాల్లోకెళ్తే..రామ్చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

మహేష్ గుర్తుకొచ్చాడట..

నటి, నిర్మాత, దర్శకురాలిగా రాణిస్తున్న మహేష్ అక్కయ్య మంజుల ఇప్పుడు సిటీ బ్యాక్ డ్రాప్ లో ఓ లవ్ స్టోరిని తెరకెక్కిస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.

బ‌రిలో డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కులు

ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌. ప్ర‌స్తుతం ఆయ‌న అక్కినేని అఖిల్‌తో హ‌లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.