హీరోయిన్ భర్తతో విడిపోనుందా..?

  • IndiaGlitz, [Sunday,July 24 2016]

నాయ‌క్‌, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో, రీసెంట్ గా మేము స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన హీరోయిన్ అమ‌లాపాల్ ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్‌ను 2014లో పెళ్ళి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎంతో అనోన్యంగా ఉంటున్న వీరి మ‌ధ్య చెడింద‌ని, త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ విడాకులు తీసుకుంటున్నార‌నే వార్త‌ చెన్నై ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. విడాకులు ఎందుకు తీసుకోనున్నార‌నే కార‌ణాలు క‌చ్చితంగా తెలియ‌డం లేదు కానీ ప్ర‌స్తుతం ఇద్ద‌రూ వేర్వేరుగా ఉంటున్నార‌ని, అందుకే అమ‌లాపాల్ వ‌రుసగా సినిమా అవ‌కాశాల‌ను వెతుక్కుంటోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు విజ‌య్ త‌మ‌న్నా, ప్ర‌భుదేవా, సోనూసూద్ కాంబినేష‌న్‌లో అభినేత్రి సినిమాను రూపొందిస్తున్నాడు. మ‌రి ఈ వార్త‌ల‌పై భార్య‌భ‌ర్త‌లెలా స్పందిస్తారో చూడాలి...

More News

సిక్స్ ప్యాక్ లో కల్యాణ్ రామ్.....

సిక్స్ ప్యాక్ ట్రెండ్ టాలీవుడ్ లో నడుస్తూనే ఉంది.డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన హీరోలను మాస్ యాంగిల్లోనే కాకుండా లుక్ పరంగా కూడా కొత్తగా చూపించాలనుకుంటాడు.

విక్రమ్ ఇంకొక్కడు ఆడియోకు గెస్ట్ ఎవరో తెలుసా...

తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్.

స్పీడు పెంచిన చైతు

అక్కినేని నాగ చైతన్య దోచెయ్ సినిమా రిలీజై సంవత్సరం దాటిపోయింది.

కొత్త కొత్త భాష అంటూ కింగ్ రాకింగ్

కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్. జై చిరంజీవ, దూకుడు, రోబో చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటించింది.

ఆ నలుగురు లో నేనున్నాను అని తెలిసినప్పుడు నా ఫీలింగ్ అదే - డి.సురేష్ బాబు

విజయ్ దేవరకొండ,రీతువర్మ,నందు ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం పెళ్లి చూపులు.