close
Choose your channels

ఆ నలుగురు లో నేనున్నాను అని తెలిసినప్పుడు నా ఫీలింగ్ అదే - డి.సురేష్ బాబు

Saturday, July 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయ్ దేవ‌ర‌కొండ‌, రీతువ‌ర్మ‌, నందు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నూత‌న ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం పెళ్లి చూపులు. ఈ చిత్రాన్ని ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ & బిగ్ బెన్ సినిమాస్ బ్యాన‌ర్స్ పై రాజ్ కందుకూరి, య‌స్.రంగినేని సంయుక్తంగా నిర్మించారు. డి.సురేష్ బాబు
స‌మ‌ర్ప‌ణ‌లో పెళ్లి చూపులు ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబుతో ఇంట‌ర్ వ్యూ మీకోసం...
ప్ర‌జెంట్ జ‌న‌రేష‌న్లో పెళ్లి చూపులు అనేవి ఎలా ఉన్నాయి..?
ప్ర‌జెంట్ పెళ్లి చూపులు ఎలా ఉన్నాయి అనే విష‌యంలో ప‌ర్సెంటేజ్ ఇంత అని చెప్ప‌లేను కానీ...గ‌తానికి ఇప్ప‌టికీ చాలా మార్పు వ‌చ్చింది. గ‌తంలో పేరెంట్స్ వాళ్ల పిల్ల‌ల‌కి ఎవ‌రైతే బాగుంటారో చూసేవారు త‌రువాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసేవారు. కానీ...ఇప్పుడు చాలా వ‌ర‌కు పిల్ల‌లే త‌మ లైఫ్ పార్ట‌న‌ర్ ని చూసుకుంటున్నారు. అదీ కూడా కొంత మంది వాళ్ల క్యాస్ట్ లో అమ్మాయిని వాళ్ల స్టేట‌స్ కి త‌గ్గ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని ఆత‌ర్వాత త‌ల్లిదండ్రుల‌కు చూపిస్తున్నారు. అలా చేస్తే పేరెంట్స్ నో చెప్ప‌డానికి కూడా ఏమీ కార‌ణం ఉండ‌డం లేదు. ఇలా నాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీస్ లో జ‌రిగింది. ఇంకొంత‌మంది పెళ్లి సంబంధాలు కోసం మ్యాట్రీమోనీ వెబ్ సైట్స్ ని ఆశ్ర‌యిస్తున్నారు. రాముడు కాలం నుంచి పెళ్లి చూపులు అనేవి ఉన్నాయి.
ఇంత‌కీ...పెళ్లి చూపులు క‌థ ఏమిటి..?
ఇంజ‌నీరింగ్ నాలుగైదు సార్లు ప‌రీక్షలు రాసిన త‌ర్వాత పాసైన సాధార‌ణ యువ‌కుడు, జీవితం పై పూర్తి అవ‌గాహ‌న ఉన్న యువ‌తి వీరిద్ద‌రి జీవితాల‌కు సంబంధించిన క‌థ ఇది. వీరిద్ద‌రూ ఒక రూమ్ లో ఉండి వాళ్ల గురించి చెప్పే విభిన్న‌క‌థ.
పెళ్లి చూపులు లో మీకు ఏం న‌చ్చింది..?
ఈ చిత్ర ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఈ క‌థ‌ను నాకు చెప్పాడు. చాలా బాగా న‌చ్చింది. ఆత‌ర్వాత రాజ్ కందుకూరి ఈ క‌థ విన్నాను ఏం చేయ‌మంటారు అని అడిగితే...నాకు కూడా న‌చ్చింది...ప్రొడ్యూస్ చేయ‌మ‌న్నాను. షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ట్రైల‌ర్ చూపించారు..ఆడియో ఫంక్ష‌న్ కి వెళ్లాను ఆత‌ర్వాత ఫ‌స్ట్ కాపీ చూపించారు. చూసిన త‌ర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. బౌండెడ్ స్ర్కిప్ట్ రెడీ చేసుకుని స్టోరీ బోర్డ్ వేసుకుని షూటింగ్ స్టార్ట్ చేసారు. అలాగే సినిమా నిర్మాణంలో నేను ఏం చేస్తానో అవ‌న్నీ ఈ టీమ్ చేసారు. అవ‌న్నీ నాకు బాగా న‌చ్చ‌డంతో ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాను.
మీ పెళ్లి చూపులు గుర్తున్నాయా..?
నాకు చాలా సిగ్గు. పెళ్లి చూపులు కోసం మా వైఫ్ ని మా ఫ్రెండ్ వాళ్ల ఇంటికి ర‌మ్మంటే వ‌చ్చింది. మూడు రోజులు వ‌స్తే...ఆ మూడు రోజులు నేను అలా చూసానే త‌ప్ప ఏం మాట్లాడ‌లేదు. నెక్ట్స్ డే ఓకే చెప్పేసాను అంతే..!
క్యూబ్ మరియు యూ ఎఫ్ ఓ రేట్లు మ‌న ద‌గ్గ‌ర బాగా ఎక్కువుగా ఉన్నాయి. వేరే రాష్ట్రాల్లో త‌క్కువుగా ఉన్నాయి అని కొంత మంది అంటున్నారు..? మీరేమంటారు..?
క్యూబ్, యూ.ఎఫ్.ఓ సిస్ట‌మ్స్ స్టార్ట్ చేసిన వాళ్లు మేము వ్యాపారం చేస్తున్నాం. దీని కోసం ఎంతో ఖ‌ర్చు పెట్టాం. మేము పెట్టిన పెట్టుబ‌డి రావాలంటే ఇంత వ‌సూలు చేయాలి అనేది వారి వాద‌న‌. అందులో త‌ప్పు లేదు. అయినా క్యూబ్ & యూ.ఎఫ్.ఓ రేట్లు ఎక్కువుగా ఉన్నాయి అని ఎవ‌రు అంటున్నారు..? ఏదో మాట్లాడాలి అని మాట్లాడేస్తున్నారు త‌ప్పా...ఎవ‌రైనా నిజాయితీ గ‌ల వాళ్లు మాట్లాడుతున్నారా..?రేట్లు ఎక్కువ వ‌సూలు చేస్తున్నారు అనుకుంటే దీనికి ప్ర‌త్యామ్నాయం ఏమిటి అనేది ఆలోచించాలి.అంతే కానీ ఏదేదో మాట్లాడ‌డం క‌రెక్ట్ కాదు.
ఇండ‌స్ట్రీ గురించి మాట్లాడుతూ...చాలా మంది ఆ న‌లుగురు చేతుల్లో ఉంది అంటుంటారు. ఆ నలుగురు లో మీ పేరు చెప్పిన‌ప్పుడు మీకు ఏమ‌నిపిస్తుంటుంది..?
కొన్ని రోజులు నా గురించి అలా మాట్లాడే వారికి వివ‌ర‌ణ ఇవ్వాలి అనుకునేవాడిని. ఆత‌ర్వాత ప‌ట్టించుకోవ‌డం మానేసాను. నేను వ్యాపారం చేస్తున్నాను అది కూడా లీగ‌ల్ గానే చేస్తున్నాను. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 3000 థియేట‌ర్స్ లో ఉండేవి. అందులో 1500 థియేట‌ర్స్ మిగిలాయి. ఇప్పుడు 1700 థియేట‌ర్స్ ఉన్నాయి. థియేట‌ర్ యాజ‌మాని లాభం వ‌స్తే...లీజుకు ఎందుకు ఇస్తాడు. థియేట‌ర్ వ‌ల‌న న‌ష్టం రావ‌డంతోనే లీజుకు ఇస్తున్నాడు. లీజు తీసుకునే నాలాంటి వాడు డిస్ట్రిబ్యూట‌ర్ అయ్యుంటే త‌న సినిమాని థియేట‌ర్ లో వేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో లీజుకు తీసుకుంటున్నాడు. ఇలా లీజుకు తీసుకున్న‌వాడికి కూడా డ‌బ్బులు రావ‌డం లేదు. దాని గురించి ఎవ‌రు మాట్లాడ‌డం లేదు. ఇండ‌స్ట్రీ అనేది త‌ల్లి లాంటిది. ప్ర‌తిదీ డ‌బ్బుతో చూడ‌లేం. ఈ విష‌యాల గురించి పూర్తి వివ‌రాల‌తో గ‌తంలోఒక‌సారి మాట్లాడాను. అందుచేత ఆ న‌లుగురులో నా పేరు చెబుతున్న‌ప్పుడు ప‌ట్టించుకోవ‌డం మానేసాను.
ఇండ‌స్ట్రీలో ఎలాంటి మార్పు రావాలి..?
ఇండ‌స్ట్రీ అంటే ఒక్క చోటే ఉండ‌కూడ‌దు. జిల్లా కొక ఇండ‌స్ట్రీ ఉండాలి. సినిమా తీయాలంటే హైద‌రాబాద్ వ‌చ్చే తీయాల్సిన అవ‌స‌రం లేదు. రాజ‌మండ్రిలో ఉండి కూడా సినిమా తీయ‌చ్చు. ఇప్పుడు అలాంటి అవ‌కాశం ఉంది. కేర‌ళ‌లో అంతే...ఆ రాష్ట్రంలో జిల్లాలోనే ఉంటారు సినిమా తీసేస్తారు. అలాంటిది ఇక్క‌డ కూడా రావాలి.
మీ చిన్న‌బ్బాయి అభిరామ్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి..?
అవ‌న్నీ రూమ‌ర్స్ మాత్ర‌మే. అందులో వాస్త‌వం లేదు.
అభిరామ్ ని హీరోగా చూడాల‌నుకోవ‌డం లేదా..?
నిజం చెప్పాలంటే...నాకు ఇష్టం లేదు. అభిరామ్ కి హీరోగా చేయాల‌ని ఉంది. హీరో అవ్వడం అంటే మాట‌లు కాదు. చూద్దాం ఏం జ‌రుగుతుందో..? (న‌వ్వుతూ..)
త‌డ‌లో ఫిల్మ్ సిటీ ప్లాన్ జ‌రుగుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి నిజ‌మేనా..?
అటు త‌మిళ సినిమా ఇటు తెలుగు సినిమా షూటింగ్స్ కి అనువైన ప్ర‌దేశం అది. అందుచేత త‌డ‌లో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాల‌నే ప్లాన్ ఉంది.
ఇంత‌కీ...రానా పెళ్లి చూపులు ఎప్పుడు..?
రానా పెళ్లి చూపులు మ‌మ్మ‌ల్ని చూడ‌మంటాడో...? లేక నేను చూసేసుకున్నాను మీరు చూడండి అని మాకు చూపిస్తాడో..? (న‌వ్వుతూ..)
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
చైత‌న్య హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందించేందుకు ప్లాన్ జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. అలాగే వెంక‌టేష్ - రానా కాంబినేష‌న్ లో మూవీ ప్లానింగ్ లో ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.