close
Choose your channels

సూర్య 40లో హీరోయిన్ ఖ‌రారైందా?

Tuesday, November 24, 2020 • తెలుగు Comments

సూర్య 40లో హీరోయిన్ ఖ‌రారైందా?

హీరో సూర్యకు 2020 బాగానే క‌లిసొచ్చింది. ఎందుకంటే చాలా రోజులుగా ఓ మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సూర్య‌కు ఈ ఏడాది విడుద‌లైన ‘ఆకాశం నీహ‌ద్దురా’ చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో పాటు విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌ల‌ను కూడా ఈ సినిమా ద‌క్కించుకుంది. కాగా త‌దుప‌రి సూర్య కిట్టిలో రెండు సినిమాలున్నాయి. అందులో సూర్య 39వ చిత్రంగా వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న ‘వడివాసల్’ ఒక‌టి. కాగా సూర్య 40వ చిత్రం పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది.

త్వ‌ర‌లోనే ‘వడివాసల్’ సెట్స్ పైకి వెళ్లనుంది. దీని తర్వాత చేయబోతున్న పాండిరాజ్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం మేర‌కుఈ చిత్రంలో సూర్య జోడీగా క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా న‌టించ‌నుంద‌ట‌. క‌న్న‌డ‌, తెలుగు చిత్రాల‌కే ప‌రిమిత‌మైన ఈ సొగ‌స‌రి రీసెంట్‌గా కార్తి హీరోగా తెర‌కెక్కుతోన్న ‘సుల్తాన్’ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే, కార్తి సోద‌రుడు సూర్య స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. క్ర‌మంగా ర‌ష్మిక త‌మిళంలోనూ పాగా వేయ‌డానికి అడుగులు వేస్తుంది.

Get Breaking News Alerts From IndiaGlitz