హీరో రామ్‌కు జరిమానా నిజమేనా!?

  • IndiaGlitz, [Monday,June 24 2019]

ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌, డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. జులై 18న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇక అసలు విషయానికొస్తే.. సినిమా ప్రారంభం మొదలుకుని ఇప్పటి వరకూ చాలా వరకు వివాదాలే ‘ఇస్మార్ట్ శంకర్’ చుట్టూ తిరిగాయి. మొన్నటి వరకూ సినిమా కథ కాపీ అని.. ఆ తర్వాత కథ మొత్తం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరో అచ్చుగుద్దినట్లుగా దింపేశారని ఇలా పలు విషయాల్లో చర్చనీయాంశమైన విషయం విదితమే.

కాగా.. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో సినిమా చివరి షూటింగ్ దశకు చేరుకుంది. మరో రెండ్రోజుల్లో ప్యాకప్ చెప్పేస్తారని తెలుస్తోంది. ఈ తరుణంలో హీరో రామ్‌కు హైదరాబాద్ పోలీసులు జరిమానా విధించినట్లు వార్తలు వస్తున్నాయి. బహిరంగంగా ధూమపానం హైదరాబాద్‌ పోలీసులు రూ. 200 జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బహిరంగ ధూమపానానికి హీరో రామ్‌కు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. కాగా సినిమా షూటింగ్ అనంతరం చార్మినార్ వద్ద రామ్ స్మోక్ చేస్తుండగా చార్మినార్ ఎస్సై గమనించి జరిమానా విధించారు.

ఇదిలా ఉంటే.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాపై వస్తున్న ఈ వార్తలన్నీ అవాస్తవాలేనని.. చిత్రబృందమే ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేసుకుని వార్తల్లో నిలుస్తోందనే ఆరోపణలూ వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత..? అబద్ధమెంత..? అనేది సినిమా తెరకెక్కించిన దర్శకుడికే ఎరుక. తాజా వ్యవహారంపై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

More News

మహాలక్ష్మి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.2 సినిమా ప్రారంభం

రంజీత్, సౌమ్య మీనన్ లకు హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ పత్తికొండ కుమారస్వామి నిర్మాణ సారధ్యంలో యం. రవికుమార్ నిర్మిస్తున్న చిత్రం

వంగవీటి రాధా కీలక నిర్ణయం.. ఈసారి జనసేనలోకి!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.

'బుర్రకథ' ట్రైలర్‌ను ఆవిష్క‌రించిన విక్ట‌రీ వెంక‌టేశ్‌

దీపాల ఆర్ట్స్ టప్ఎండ్ స్టూడియోస్ లిమిటెడ్ బ్యానర్లపై శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్ రెడ్డి నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బుర్రకథ'.

దొరసాని ‘కళ్లల్లో కలవరమై’ సాంగ్ లాంచ్

ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’..

వాలంటీర్లు, ఎమ్మెల్యేలకు వార్నింగ్.. టీడీపీ కార్యకర్తలకు జగన్ గుడ్ న్యూస్!

ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.